సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో దళపతి విజయ్ ఒకరు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ తుపాకీ మూవీ నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. విజయ్ చిత్రాలు ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే విజయ్ కి ఎంత పాపులారిటీ ఉందో దానితో పాటు వివాదాలు ఉన్నాయి.
తన సినిమాల్లోని డైలాగ్స్, ఇతర విషయలలో పలు మార్లు వివాదాలలో ఇరుక్కున్నారు. అయితే వివాదాలలో కూడా ప్రశాంతంగా వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళడం ఆయన ప్రత్యేకత. అందుకే అభిమానులు విజయ్ ని మరింత ఇష్టపడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయినా, వివాదాలైనా సరే, అభిమానులు ఎప్పుడూ తమ స్టార్‌కి అండగా ఉన్నారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ ఇరుకున్న వివాదాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. తుపాకి మూవీ వివాదం:
2012 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్ స్మోకింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే పై రాజకీయ నేతలు విమర్శలు చేశారు. అలాగే సినిమా విడుదలకు కాకముందే సినిమాలో విలన్ పాత్రని చూపించిన విధానంపై కొన్ని సంఘాలు ఈ సినిమా కథ పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే విజయ్ వాటిని ప్రశాంతంగా సాల్వ్ చేశాడు. రిలీజ్ అయిన తరువాత ‘తుపాకి ‘ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
2. తలైవా వివాదం:
2013 లో రిలీజ్ అయిన తలైవా సినిమా వివాదాల వల్ల ఆర్థికంగా నష్టపోయింది. ఈ మూవీలో విజయ్, అమలా పాల్ నటించగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాతో తెరకెక్కిన తలైవా కథ రాజకీయంగా రెచ్చగొట్టేలా ఉందని పలువురు విమర్శలు వచ్చాయి. తలైవా అని టైటిల్ పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ టైంలో తమిళనాడు ప్రభుత్వాన్ని పాలిస్తున్న అధికార పార్టీ విజయ్ పై ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది.
రాష్ట్రంలో సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసింది. అయితే విజయ్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించిన తర్వాత మూవీ రిలీజ్ తమిళనాడు లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయిన వారానికి తమిళనాడులో విడుదలైంది. దీంతో సినిమాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని వల్ల మేకర్స్ ఆర్థికంగా నష్టపోయారు.
3. కత్తి వివాదం
హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి కూడా విడుదల చేయకుండా ఆపేశారు. అయితే ఈ సినిమా తమిళ్ లో విడుదలకి ముందు కూడా చాలా గొడవలు జరిగాయి. ప్రముఖ డైరెక్టర్ గోపి నైనార్ కత్తి సినిమా కథ తనదే అని, ఏఆర్ మురుగదాస్ తో ఈ కథ చర్చిస్తున్నప్పుడు ఆ కథనే తీసుకొని తాను సినిమాగా తీశారు అని, మురుగదాస్ తనని మోసం చేశారు అని చెప్పారు. కానీ ఆ తర్వాత మురుగదాస్ ఈ విషయంపై మాట్లాడి మొత్తం పరిష్కరించారు.

4. పులి వివాదం:
2015 లో పులి అనే సోషియో ఫాంటసీ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లు విజయ్ మరియు నిర్మాతల ఆస్తుల పై దాడులు చేసి రిలీజ్ రోజు వరకు విచారణ కొనసాగించారు. ఫస్ట్ డే మార్నింగ్ షోలను థియేటర్ యాజమాన్యాలు రద్దు చేసేలా చేసి, విచారణ పూర్తి అయ్యాకే సినిమాను రిలీజ్ చేసేందుకు అనుమతించారు. విజయ్ విచారణలో క్లారిటీ వచ్చిన తరువాత మధ్యాహ్నం నుండి విడుదలైంది.
5. మెర్సల్ వివాదం:
2017లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దేశంలో జరుగుతున్న మెడికల్ స్కామ్ గురించి చెప్పడంతో ఈ సినిమా పై వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విజయ్ డైలాగ్‌ను అధికార కేంద్ర పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ మద్దతుదారులు కూడా విజయ్ ప్రభుత్వం పై ప్రతికూల ప్రచారం చేశారని ఆరోపించారు మరియు నటుడు మరియు చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
6. సర్కార్ వివాదం: 2018
2018లో రిలీజ్ అయిన సర్కార్ సినిమా పై కూడా వివాదాలు తలెత్తాయి స్మోకింగ్ చేస్తున్న విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఈ ఫోటోతో రాజకీయ నాయకులు విజయ్ విమర్శించారు. దాంతో విజయ్ దానిని తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి తొలగించాడు. అంతే కాకుండా సినిమాలో కొన్ని డైలాగులపై ప్రభుత్వ అధికారులు సినిమా రిలీజ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరించి, రిలీజ్ అయ్యేలా చేశారు.
7. బిగిల్ సినిమా వివాదం:
2019 లో వచ్చిన బిగిల్ కూడా వివాదాస్పద చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఒక వ్యక్తి తన కథను కాపీ చేశారని ఆరోపిస్తూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసాడు. బిగిల్ చిత్రీకరణను అపాలని కోర్టుకు వెళ్ళాడు. ఆ తరువాత ఈ కేసును చెన్నై సిటీ సివిల్ కోర్టు కొట్టి వేసింది.
8. ఆదాయపు పన్ను దాడులు:
ఫిబ్రవరి 5, 2020న, షూటింగ్ లో ఉన్న విజయ్ మాస్టర్ సెట్స్ పైన ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లు రైడ్ చేశారు. AGS సినిమాస్ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కోసం విజయ్ ని కూడా విచారించారు. మదురైలోని ఏజీఎస్ సినిమాస్, ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ ఆస్తులపై దాడులు జరిగాయి. అలాగే చెన్నైలోని విజయ్ నివాసం పై కూడా ఇన్ కమ్ టాక్స్ శాఖ దాడులు చేసింది.
9. తల్లిదండ్రులపై కేసు:
2021 లో రాజకీయాలలో తన పేరును లేదా తన అభిమాన సంఘాల పేరును ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ దళపతి విజయ్ తన తల్లిదండ్రులతో పాటుగా మరికొందరి పై కేసు పెట్టారు. ఈ కేసును కోర్టు విచారించి, విజయ్ తండ్రి తన కొడుకు పేరు మీద స్థాపించిన రాజకీయ పార్టీ విజయ్ మక్కల్ ఇయక్కమ్‌ను రద్దు చేసింది.
10. రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు:
దళపతి విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు పై ఎంట్రీ ట్యాక్స్ చెల్లించనందుకు గత ఏడాది తలపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. విజయ్ సెప్టెంబర్ 2021లో రూ. 7,98,075 ఎంట్రీ ట్యాక్స్‌ని చెల్లించాడు. కానీ డిసెంబర్ 2005 -సెప్టెంబరు 2021 మధ్య పన్ను చెల్లించనందుకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూ. 30,23,609 జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. అయితే, విజయ్ దానిని తగ్గించాలని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. గడువుకు ముందే పూర్తి ట్యాక్స్ చెల్లించడంతో చెన్నై హైకోర్టు ఆ కేసును కొట్టి వేసింది.
11. ట్రాఫిక్ ఉల్లంఘన నియమాలు
టింటెడ్ గ్లాస్ వాడకాన్నిసుప్రీంకోర్టు నిషేధించిన తరువాత దళపతి విజయ్ కారుకు నల్లటి అద్దాలు ఉండడంతో రూ. 500 జరిమానా విధించారు. అలాగే టింటెడ్ గ్లాస్‌ను తొలగించాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.
12. విడాకుల పుకార్లు:
దళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. దానికి కారణం విజయ్ మరియు అతని భార్య సంగీత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు విజయ్ వికీపీడియా పేజీలో రావడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.
అయితే వారి సన్నిహిత వర్గాలు రూమర్స్ మాత్రమే అని తెలిపాయి. అప్పటితో ఈ వార్తలు ఆగిపోయాయి.

ఇంగ్లండ్ సంవత్సర కాలంగా జట్టు బజ్‌బాల్ క్రికెట్‌తో మంచి ఫలితాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టు బెన్‌స్టోక్స్ సారధ్యంలో కొత్తగా కనిపించింది. ఈ జట్టు బజ్‌బాల్ తో సౌతాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్నది సిరీస్ ప్రతిష్టాత్మక యాషెస్, రీసెంట్ గా ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను బజ్‌బాల్ టెక్నిక్ తో ఎదుర్కొని మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవలేకపోయింది.
‘బజ్‌బాల్’ అంటే..
పేరు ఎలా వచ్చిందంటే..
ఇక ఈ ఆలోచన కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ది అందువల్ల ఈ విధానానికి ‘బజ్‌బాల్’ పేరు వచ్చిందనుకోవచ్చు. అయితే పాపులర్ క్రికెట్ పోర్టల్ జర్నలిస్టు తొలిసారిగా ఈ పేరును వాడాడు. ఆ తర్వాత ఇది అలాగే పాపులర్ అయ్యిందని తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీ రాముడిగా, సీతగా హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ మూవీలో రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, వేషధారణ పై వివాదాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ప్రశంసలు కురిపించారు.
పూజారి రంగరాజన్ మాట్లాడుతూ, ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి శ్రీ రాముడి గుణాలు గురించి అంతా వెతుకుతున్నారని, ఆదిపురుష్ లో చూపించినట్లుగానే రామాయణం ఉందా? వేరే విధంగా ఉందా అని వెతుకుతున్నారు. ప్రపంచమంతా రాములవారి గురించి మాట్లాడేటట్టు చేసినందుకు ఆదిపురుష్ మూవీ యూనిట్ ను అభినందిస్తున్నాను.
ఇక రావణాసురుడు, శ్రీరాముడు, హనుమంతుడు ఇలా చూపించారని సోషల్ మీడియాలో విమర్శించేవారిని ఉద్దేశించి, ఆదికవి వాల్మీకిలగా రామాయణాన్ని ఎవరు తీయలేరు. వేరే ఎవరు ప్రయత్నం చేసినా దానిలో ఏదో కొదవ ఉంటుందని అన్నారు. దానిని గుర్తించి ఆ ప్రయత్నాన్ని అభినందించాలని, ప్రతీ ఒక్కరు కూడా రాములవారి వైభవాన్ని కీర్తించే ఈ మూవీని తప్పకుండా చూడాలని అన్నారు.
ఆంజనేయుడు దేవుడు కాదని, భక్తుడు మాత్రమే అని ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ ఖన్నా చిత్రయూనిట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ అందరిని కాల్చేయాలని అన్నారు. ముఖేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ‘రామాయణానికి ఆదిపురుష్ ని మించిన అవమానం లేదని, డైరెక్టర్ కు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు.
ఇక రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా అర్థంలేని డైలాగ్స్ ని రాసారని, ఇటువంటి చెత్త డైలాగ్స్ రాసిన వారిని, ఈ మూవీని తీసినవారిని క్షమించకూడదు. రావణుడికి వరం ఎవరు ఇచ్చారో కూడా తెలియదని, హిరణ్యకశ్యపుడి వరాన్ని రావణుడికి చెప్పించారని, రామాయణాన్ని ఇంత అపహాస్యం చేసి, మూవీ యూనిట్ తమను తాము ఇంకా సమర్ధించు కుంటున్నారు.
ఈ మూవీ యూనిట్ మొత్తాన్ని కూడా 50 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలబెట్టి తగలబెట్టాలని అన్నారు. మూవీ పై విమర్శలు వస్తే, మౌనంగా ఉంటారని అనుకున్నాను. అయితే చిత్రయూనిట్ సనాతన ధర్మం కోసమే చేసినట్టు చెబుతున్నారు. వారు రామాయణాన్ని మొత్తం మార్చేశారు అని ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.
ఆది పురుష్ 500 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ, ఈ మూవీ త్రీడిలో తీయడంతో ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తితో ఎదురుచూశారు. హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ పై వివాదం రాగా, మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించింది.
ఆదిపురుష్ వివాదాలు, విమర్శల మధ్య బాక్సాఫీసు దగ్గర కొనసాగుతోంది. మూడు రోజుల్లో 340 కోట్లు వసూల్ చేసిన ఈ మూవీ, నాలుగవ రోజు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు అంటున్నారు. ఈ మూవీ దర్శకుడు ఓంరౌత్ ను, రచయితను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని మరొక విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఈ మూవీలో చూపించిన లంక సీన్ ను హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేసినట్లు గమనించారు. ఆ సినిమా ఏమిటంటే థోర్, ఆ సినిమాలోని అస్గార్డ్ సెట్ ను కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అందులో గోల్డ్ కలర్ లో ఉంటే, ఆదిపురుష్ బ్లాక్ కలర్ లో చూపించారని డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ తనకు కెరీర్ ను ఇచ్చిన హీరో గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వెతుకుతున్న టైంలో ఒక హీరో వల్ల కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుందని, ఆయన లేకపోతే తనకు లైఫ్ ఉండేది కాదని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. ఆ హీరో వేణు తొట్టెంపూడి. ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ “నా లైఫ్ లో చాలా కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎందరి దగ్గరికో తిరిగానని, అలాంటి టైంలో వేణు సార్ పిలిచి మరీ నాకు ఛాన్స్ ఇచ్చారు” అని అన్నారు.
వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ మూవీలో “నిన్నలా మొన్నలా లేదురా” అనే సాంగ్ కు కొరియోగ్రఫర్ గా పని చేశానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. చిరునవ్వుతో సినిమానే రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రఫర్ గా తొలి సినిమా. వేణు సార్ వల్లే తన లైఫ్ గొప్పగా మారిందని రాకేష్ మాస్టర్ అన్నారు. కాగా రాకేష్ మాస్టర్ సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏడవ సీజన్ లో భాగంగా సరికొత్త టాస్కులను పోటీదారులకు ఇస్తారని సమాచారం. ఈసారి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి, పాపులర్ అయిన సెలెబ్రెటీలను బిగ్ బాస్ ఏడవ సీజన్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు ఈసారి కొత్త దంపతులతో పాటుగా డైవర్స్ తీసుకున్న సినీ సెలబ్రిటీలను తీసుకువస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఏడవ సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున కాకుండా హీరో రానా దగ్గుబాటి వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ 7 లో పాల్గొనే పోటీదారులు వీళ్లే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..
1. అమర్ దీప్- జానకి కలగనలేదు సీరియల్ నటుడు.
5.హేమచంద్ర – సింగర్.
9. విష్ణు ప్రియ – యాంకర్.
13. ఐశ్వర్య – సీరియల్ హీరోయిన్.
17. పండు – కొరియోగ్రాఫర్
21. పల్లవి ప్రశాంత్- కామన్ మ్యాన్ క్యాటగిరి
ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. ప్రధానంగా అశ్విన్ విషయంలో మిస్టేక్ చేశాడు. భారత జట్టు ద్వైపాక్షిక ఈవెంట్స్ లో గెలిచినప్పటికీ, ఐసీసీ ట్రోఫీ విషయంలో మాత్రం విజయం సాధించలేకపోతుంది. చెప్పాలంటే ధోని వంటి కెప్టెన్ భారత జట్టు మళ్లీ దొరకలేదని చెప్పవచ్చు. ఇక ఈ నెలలో జరిగిన డబ్య్లూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓటమి కెప్టెన్ గా రోహిత్ శర్మ భవితవ్యం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియా మాజీ సెలెక్టర్ భూపిందర్ సింగ్ సీనియర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనిని కెప్టెన్‌గా ఎందుకు నియమించారో వెల్లడించాడు. ‘కెప్టెన్ ను జట్టు నుండి డైరెక్ట్ గా ఎన్నుకోకుండా, ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్, టీమ్ ను ముందుండి నడిపించగలిగే లక్షణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇతర ప్లేయర్స్ తో మాట్లాడే విధానం, వంటి విషయాల్లో నైపుణ్యాలను బట్టి కెప్టెన్‌గా ఎన్నుకుంటారు. అలాంటి లక్షణాలను ధోని కెప్టెన్ కాకముందే చాలా సార్లు కనబర్చాడు. ఆ విషయంలో మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని తెలిపారు.
రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు అని అంటున్నారు. కానీ ఆయన అసలు పేరు రామిరెడ్డి అని, నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని జమ్మిపాడు ఆయన స్వస్థలమని రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ చిట్టిబాబు తెలిపారు. రాకేష్ మాస్టర్ తండ్రి పేరు బాలిరెడ్డి. ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి . కమ్యూనిస్ట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు బాలిరెడ్డి ఆయనకు అనుచరుడుగా ఉన్నారు. కుల వివక్ష ఉండకూదని సుందరయ్య తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కొరియోగ్రాఫర్లకు రాకేష్ మాస్టర్ గురువు. తర్వాత హైదరాబాద్ కి వచ్చి పలు టెలివిజన్ డాన్స్ షోలలో పాల్గొన్నారు. ఆ తరవాత ఇండస్ట్రీలో అడుగు పెట్టి, దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. రాకేష్ మాస్టర్ మద్యానికి అలవాటుపడి, తాగిన మైకంలో మూర్ఖంగా మాట్లాడేవారని, ఈ ప్రవర్తనే ఆయనను సినీ పరిశ్రమకు దూరం చేసిందని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక రాకేష్ మాస్టర్ పర్సనల్ లైఫ్ విషయనికి వస్తే, ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య విద్యావంతురాలని, ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా చేస్తున్నారని ఆలేటి ఆటమ్ అన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కానీ రాకేష్ మాస్టర్ ప్రవర్తన వల్ల భార్యకు దూరమయ్యారు. ఆ తరవాత రెండవ వివాహం చేసుకున్నారు. ఇటీవల మరో అమ్మాయితో సహజీవనం చేశారు.
సునీల్ లహరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించామని డిస్క్లెయిమర్లో క్లియర్ గా చెప్పారు. రామాయణంలో ఇలాంటి డైలాగ్స్ ఉపయోగించడం సిగ్గు చేటు అని అన్నారు. రావణుడిని పుష్పక విమానంతో చూపించలేదని, లక్ష్మణుడు, మేఘనాథ్ యుద్ధాన్ని నీటిలో చూపించారని’ అన్నారు.
‘ఏ పాత్రకు కూడా క్యారెక్టరైజేషన్ స్పష్టంగా లేదు. డైరెక్టర్ ఈ చిత్రం ఎందుకు తీశాడో, విఎఫ్ఎక్స్తో మూవీని నిలబెట్టలేరు. రామాయణాన్ని సింపుల్‌గా చెప్పాలి. హనుమంతుడితో అలాంటి సంభాషణలు ఎలా చెప్పించారో అర్థం కావట్లేదు’ అని అన్నారు. ఆదిపురుష్ సినిమాలోని క్యారెక్టర్లను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. రావణుడు చాలా అందమైన దేశానికి రాజు. ఈ మూవీలో అలా ఎందుకు చూపించారో, నకిలీ సీతను చూపించాల్సిన అవసరం ఏం వచ్చిందని అన్నారు.
‘మూవీలో స్టోరీని సరళంగా చెప్తే, పరిస్థితి వేరేలా ఉండేది. ఈ మూవీలోని పాత్రలన్ని అయోమయంగా ఉన్నాయని, ఇది నటినటుల మిస్టేక్ కాదు. పాత్రలు స్పష్టంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రం తెరకెక్కించడంలో ఇంకాస్త తెలివిగా వ్యవహరించాల్సింది.’ అని సునీల్ లహరి అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు.