బాలీవు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ తెచుకుంది. ఈ మూవీ పై విమర్శలు, వివాదాలు వస్తున్నప్పటికి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ భారీగా రాబడుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సీతాదేవిగా కృతిసనన్, రావణుడుగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. అయితే ఈ చిత్రంలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన యాక్టర్ పేరు వత్సల్ శేత్. 1980 లో ఆగస్టు 5న వత్సల్ సేథ్ జన్మించాడు. వత్సల్, ఉత్పల్ షాంఘ్వీ గ్లోబల్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, ముంబైలోని విలే పార్లేలోని గోకలిబాయి పునమ్చంద్ పీతాంబర్ హైస్కూల్లో తన ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. ముంబైలోని మిథిబాయి కాలేజీ నుండి గణితశాస్త్రంలో పట్టా పొందారు. వత్సల్ మొదట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడు.
కాని జస్ట్ మొహబ్బత్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత పలు టెలివిజన్ షోలలో నటించారు. ఆ ఆతరువాత బాలీవుడ్ సినిమాలలోనూ నటించాడు. 2004లో వచ్చిన టార్జాన్: ది వండర్ కార్ అనే చిత్రంలో రాజ్ చౌదరి అనే పాత్రను చేశాడు. ఇదే అతని మొదటి సినిమా. 2014లో వచ్చిన థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీ, 2017లో లవ్-సాగా సిరీస్ హాసిల్ లో నటించి పాపులర్ అయ్యాడు. వత్సల్ నటుడు మాత్రమే కాదు మోడల్ కూడా.
2020లో వత్సల్ శేత్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 36వ ప్లేస్ లో నిలిచాడు. వత్సల్ శేత్ తన సహనటి ఇషితా దత్తాను 2017 లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట తరచు విహారయాత్రలు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ గా నటించి, తెలుగు ఆడియెన్స్ కి ముందుకు వచ్చారు.
https://www.instagram.com/p/CoHoNdIryUD/?hl=en
Also Read: “మా నాన్న ఇలా కావడానికి కారణం వాళ్ళే..!”అంటూ… రాకేష్ మాస్టర్ కొడుకు కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“ఆది పురుష్ మూవీ చూసారా.. చూస్తే మీ అభిప్రాయం పంచుకోగలరు” అని అడిగిన ప్రశ్నకు కిరణ్ అనే యూజర్ ఆదిపురుష్ ఇంద్రజిత్ పాత్ర ఫోటోను షేర్ చేస్తూ ఇలా సమాధానం ఇచ్చారు. “ఈ వ్యక్తి పూరీ జగన్నాధ్ చిత్రాలలో బ్యాంకాక్ లో తప్పుడు పదార్ధాలు అమ్మేవాడిలా ఉన్నాడు. రావణుడి కుమారుడు అయిన ఇంద్రజిత్ కి ఈ టాటూలు ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏమిటో అర్ధం కావట్లేదని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా దర్శకుడు ఓం రౌత్ సినిమాటిక్ లిబర్టీ పేరుతో రావణుడితో వెల్డింగ్ వర్క్, అనకొండలతో మసాజ్ చేయించుకున్నట్లు ఇలాంటివి చాలానే చేయించాడు. రామాయణ క్యారెక్టర్ల ఔచిత్యాన్ని తగ్గించేలా తెరకెక్కించాడు. ఆదిపురుష్ మూవీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని ఇంతగా వక్రీకరించి తియ్యాలనే ఆలోచన ఓం రౌత్ ఎలా వచ్చిందో తెలియదు.
రామాయణం చదివిన వారికి ఇలాంటి సీన్స్ పంటికింద పడిన రాళ్ళలా అనిపిస్తాయి. ఆ ఇబ్బందిని పక్కన పెడితే ఆది పురుష్ మూవీ బాగుంది. ఇక ఈ మూవీ పై వస్తున్న విమర్శలు, మీమ్స్ ని పక్కనపెట్టి థియేటర్ లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది” అని కిరణ్ వివరించారు.
టైటానిక్ నౌక 1912లో సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నౌక శకలాలను చూడడం కోసం పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన తనయుడు సులేమాన్, బ్రిటీష్ బిజినెస్ మెన్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్ పాల్ హెన్నీ, ఓషన్ గేట్ ఫౌండర్ స్టాక్టన్ రష్ టైటాన్ జలాంతర్గామిలో ప్రయాణించారు.
ఈ అడ్వెంచర్ ట్రిప్ కు టికెట్ 2 కోట్ల పైనే ఉంటుంది. అత్యంత ఖరీదైన టూర్ అయినప్పటికీ సాహసాలు ఇష్టపడే వారు సముద్రం అడుగున ఉన్న టైటానిక్ శిథిలాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బందితో ఈ జలాంతర్గామి బయలుదేరింది. అయితే సముద్రం లోపలికి వెళ్లిన అనంతరం జలాంతర్గామిలో ఏదో సమస్య వచ్చింది. సిగ్నల్ కట్ అయింది. ట్రిప్ ను ప్రారంభించిన గంట 45 నిముషాల్లోనే జలాంతర్గామి కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే జలాంతర్గామిలో మరో 72 గంటలవరకు సరిపడే ఆక్సిజన్ ఉన్నట్లు సమాచారం.
జలాంతర్గామి లోపల చలి ఎక్కువయినపుడు ఆక్సీజన్ ఎక్కువ అవసరం ఉంటుందని, అందరు ఒక్కదగ్గర ఉండడం ద్వారా శరీరంలోని వేడిని ఆదా చేసుకోవచ్చని సెయింట్ జాన్స్ మెమోరియల్ యూనివర్సిటీ హైపర్బరిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కెన్ లీడెజ్ అన్నారు. ఆక్సీజన్ నిల్వలు తగ్గిపోవడం మాత్రమే సమస్య కాదని, ఆ నౌకలో విద్యుత్ నిలిచిపోయిన ప్రమాదమే అని అన్నారు. జలాంతర్గామి లోపలి ఆక్సీజన్, కార్బన్ డయాక్సైడ్ల లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో విద్యుత్ పాత్ర ఉంటుంది.
ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయిన కొద్ది, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలా జరిగితే వారి కండిషన్ సీరియస్ అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ బాడీ మందకొడిగా మారి, మత్తు మందు పీల్చినట్లుగా వారంతా నిద్రలోకి వెళతారని, మనిషి బ్లడ్ ఫ్లోలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అయితే వారు హైపర్కాప్నియాకు గురవుతారు. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే చనిపోతారు’’ అని చెప్పారు.
రాకేష్ మాస్టర్ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి, కొరియోగ్రాఫర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ అంతే వేగంగా ఆయన కిందికి పడిపోయారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ పని చేశారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలలో ఆయన చేసిన కామెంట్స్ తో రాకేష్ మాస్టర్ తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి పడిపోయేలా చేసుకున్నారు.
రాకేష్ మాస్టర్ బతికి ఉన్నన్ని రోజులు యూట్యూబ్ చానెళ్లు తమ లాభం కోసం తన తండ్రిని చెడుగా చూపించారని, మాస్టర్ తనయుడు చరణ్ ఛానెళ్లను తప్పు పడుతూ, యూట్యూబ్ చానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోవడానికి కారణం యూట్యూబ్ చానెళ్ళే అని అన్నారు. తన తండ్రికి ఇలా జరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. అనేక యూట్యూబ్ ఛానెల్స్ తన తండ్రిని స్వలాభం కోసం వాడుకున్నాయని, తన తండ్రిని చెడుగా చిత్రీకరించారని అన్నాడు.
ఆ వీడియోలను వెంటనే ఆపమని, ఇకపై ఆ వీడియోలను వేయడం మానేయమని అన్నారు. సోషల్ మీడియాలో మా ఫ్యామిలీ మెంబర్స్ ను గురించి మాట్లాడుతూ వేధించవద్దని అన్నారు. మా ఫ్యామిలికి చేసిన నష్టం చాలని చరణ్ ఆవేదనతో అన్నారు. ఎవరైనా మళ్లీ మా జీవితాల్లోకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.



రాకేష్ మాస్టర్ కొద్దికాలంగా ఎవరు లేని వాడిలా అనాధశ్రమంలో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ ఎందుకిలా అయ్యాడని అనుకున్నారు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసి, చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్న రాకేష్ మాస్టర్ ఏమి సంపాదించుకోలేదా, అందువల్లే ఆఖరి దశలో అనాధశ్రమంలో జీవించారా అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.
ఆయన చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ మహిళతో విభేదాలు రావడంతో ఆమెకు కూడా దూరమయ్యారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఆస్తులు బాగానే సంపాదించారని సమాచారం. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లాతో పాటు, హైదరాబాద్ శివార్లలో 3 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.
హిందు సనాతన ధర్మంలో మనిషి మృతికి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి. దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలకు వెళ్ళిన అనంతరం చేయాల్సిన మరియు చేయకూడని పనుల గురించి పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయోజనం మరియు క్షేమం కోసం పాటించాల్సిన పదహారు సంస్కారాలను సనాతన ధర్మంలో వివరించారు. వీటిలో ఒకటి మనిషి చనిపోయిన తరువాత చేసే కార్యక్రమానికి సంబంధించినది.
ఒక మనిషి మరణం తరువాత అంతిమ సంస్కారాలు, ఆచారాలు పూర్తి అయిన తర్వాత ఆత్మ వెళ్ళి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ ఆత్మకి ఈ లోకంతో ఉన్న సంబంధాలు అన్ని తొలగిపోతాయి. గరుడ పురాణంలో అంత్యక్రియలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి వివరించారు. గరుడ పురాణం ప్రకారంగా అంత్యక్రియల తరువాత మనిషి తిరిగి వస్తున్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు.
ఒకవేళ అలా చూసినట్లయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ చూసిన వారితో ప్రేమలో పడుతుందట. తన మరణం వల్ల ఆ వ్యక్తి ఒక్కరే బాధ పడుతున్నాడని ఆత్మ భావిస్తుందట. అలాంటి స్థితిలో ఆ ఆత్మకు శాంతి కలగదు. ఆత్మ ఆ వ్యక్తితో అనుబంధాన్నిపెంచుకుని, తనతో పాటు ఇంటికి వెళ్లాలని భావిస్తుందంట. ఈ కారణం వల్లనే అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు.
మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సీఎస్కే కెప్టెన్ గా ధోని ఇప్పటి దాకా సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోని భారత జట్టు ఫినిషర్‌గా ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ధోని కెరీర్లో అంతర్జాతీయంగా 90 టెస్ట్ మ్యాచులు, 350 వన్డే మ్యాచులు, 98 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక టెస్టుల్లో 4876 పరుగులు, వన్డేల్లో 10773 పరుగులు, టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 2020లో ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా 2010లో జూలై 4న ధోని సాక్షిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2015లో ఫిబ్రవరి 6న కుమార్తె జన్మించింది. ఆమె పేరు జివా. రిటైర్మెంట్ తరువాత ఫ్యామిలీతో గడుపుతున్న ధోనీ, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇటీవల తన పేరుతోనే ఒక ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్ కు సీఈఓ బాధ్యతను ధోనీ తన అత్తగారికి అప్పగించారు. ఆమె ధోనీ భార్య సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్. తన నిర్మాణ సంస్థలో ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోసం భార్య సాక్షి సింగ్, అత్తగారు షీలా సింగ్‌కు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించాడని తెలుస్తోంది. ఇక ఈ సంస్థ విలువ సుమారు 800 కోట్లని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థలో సాక్షి సింగ్ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్‌లోని రావణుని లంక అచ్చం థోర్ అస్గార్డ్ లాగా ఉందని, ఆ మూవీ నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆదిపురుష్‌లోని పోరాట సన్నివేశాలను కూడా హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసిన డ్యాన్స్ స్టెప్స్ ని వేసి రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ముక్కు రాజు మాస్టర్ రాకేష్ మాస్టరుని తన దగ్గర ఉన్నపద్నాలుగు మంది డ్యాన్సర్లకు హెడ్ ని చేశారు. కానీ రాకేష్ మాస్టర్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఆ పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఆయన పై పగ పట్టారు. అయినా కూడా రాకేష్ మాస్టర్ తన ప్రవర్తనను మార్చుకోకుండా ఆ డ్యాన్సర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గురువు ముక్కు రాజు మాస్టర్ చెప్పిన సలహాతో వేరే ప్రాంతానికి వెళ్లిన మాస్టర్, డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి బాగా పాపులర్ అయ్యాడు.
వేణు హీరో అవకుముందు రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. తాను హీరో అయిన తరువాత చిరునవ్వుతో సినిమా కోసం రాకేష్ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా చేశారు. అందులో ‘నిన్నలా మొన్నలా’ అనే పాటకు కొరియోగ్రాఫి చేశారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ పాటతో రాకేష్ మాస్టర్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆయన 1500 సినిమాలకు కొరియోగ్రాఫి చేశారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే.