కెప్టెన్ కూల్ “ధోని” ఇరుక్కున్న 5 కాంట్రవర్సిలు ఏంటో తెలుసా.? 5 వ ది చాలామందికి తెలియకపోవచ్చు.!

కెప్టెన్ కూల్ “ధోని” ఇరుక్కున్న 5 కాంట్రవర్సిలు ఏంటో తెలుసా.? 5 వ ది చాలామందికి తెలియకపోవచ్చు.!

by Mohana Priya

Ads

మహేంద్ర సింగ్ ధోనీ. పరిచయం అక్కర్లేని వ్యక్తి. ధోని క్రికెట్ జీవితానికి, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు మనందరికీ తెలుసు.

Video Advertisement

కానీ ధోనీ గురించి చాలా మందికి అంత పెద్దగా తెలియని విషయాలు కూడా ఉన్నాయి. క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం ధోనీ గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

# 2007 లో సౌతాఫ్రికాలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అదే సంవత్సరంలో ధోనీ ODI కి నాయకత్వ బాధ్యత వహించారు. ఆ తర్వాత సిడ్నీలో జరిగిన సిరీస్ లో ధోనీ సేన ఘన విజయం సాధించింది. ఇది నేషనల్ కెప్టెన్ గా ధోనీ మొదటి వన్డే సిరీస్. అప్పుడు ధోనీ రాంచీలోని ఆలయంలో ఒక మేకని బలి ఇచ్చారు అనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై దేశం మొత్తం ఎంతో చర్చ జరిగింది. తర్వాత ఇలాంటి విషయాలను ధోనీ మళ్లీ పునరావృతం కాకుండా చూసుకున్నారు.

Dark secrets of MS Dhoni

# అదే ట్రై నేషనల్ సిరీస్ లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధోనీ వేసుకున్న గ్లోవ్స్ ఇల్లీగల్ అని క్రికెట్ బోర్డ్ ఐడెంటిఫై చేసింది. మళ్ళీ తర్వాత ఆ గ్లోవ్స్ వాడితే పెనాల్టీ వేస్తామని బోర్డ్ పేర్కొంది.

Dark secrets of MS Dhoni

# 2013 లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుంది. కిట్టీ అనే ఒక బుకీ గురునాథ్ మీయప్పన్, ధోనీ మ్యాచ్ ఓడిపోవడానికి అంగీకరించారు అని , ఆ విషయాన్ని తనకి చెప్పారని పేర్కొన్నారు. ఇదంతా ఎస్పీ కుమార్ తన దర్యాప్తులో పేర్కొన్నారు. ఈ విషయం అప్పుడు చర్చ లో నిలిచింది.

Dark secrets of MS Dhoni

# ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇండియా సిమెంట్స్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీ ని ఇండియా సిమెంట్స్ సొంతం చేసుకోవడంతో చర్చ మొదలైంది. మాజీ ఏఎంసీ చైర్మన్ బీసిసిఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. ఒకసారి శ్రీనివాసన్ సిఫారసు చేసి ధోనీ కెప్టెన్సీ ని తిరిగి నిలుపుకోవడానికి సహాయం చేశారు.

Dark secrets of MS Dhoni

ధోనీ కూడా శ్రీనివాసన్ గురించి చాలా బాగా మాట్లాడతారు. శ్రీనివాసన్ ఇతర క్రికెటర్లకు కూడా సహాయం చేస్తారు అని చెప్పారు. ధోనీ కి, శ్రీనివాసన్ కి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ తన డెమోక్రసీ’ స్ XI – ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ పుస్తకంలో రాశారు.

Dark secrets of MS Dhoni

# ధోనీ తన స్నేహితురాలైన సాక్షిని పెళ్లి చేసుకున్నారు. కానీ ధోనీ అంతకుముందు దీపిక పదుకొన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. అలాగే 2009లో రాయ్ లక్ష్మీ కూడా తను, ధోనీ రిలేషన్ షిప్ లో ఉన్నాము అని అది కొన్ని నెలలు ఉన్న స్కార్ (మచ్చ)  లాంటిది అని చెప్పారు.

Dark secrets of MS Dhoni

అలాగే కామెడీ నైట్స్ విత్ కపిల్ ప్రోగ్రాం ఫార్మర్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రీతి సిమోస్ తో డేటింగ్ చేశారు అనే వార్తలు వచ్చాయి. అలాగే నటి అసిన్ తో కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్త అప్పుడు చర్చలో నిలిచింది. ఇవన్నీ మాత్రమే కాకుండా, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ నుండి ధోనీ తప్పుకొని, రుతురాజ్ ని కెప్టెన్ గా ప్రకటించడం మీద కూడా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా ఒక రకంగా వివాదాలకు దారి తీసే విషయం అయ్యింది. ఎక్కడ చూసినా ఇదే విషయం మీద మాట్లాడుకున్నారు.


End of Article

You may also like