ఒకప్పుడు ధోనీతో కలిసి ఆడిన క్రికెటర్… ఇప్పుడు బస్ డ్రైవర్ అయ్యాడు..! ఎవరంటే..?

ఒకప్పుడు ధోనీతో కలిసి ఆడిన క్రికెటర్… ఇప్పుడు బస్ డ్రైవర్ అయ్యాడు..! ఎవరంటే..?

by Mohana Priya

Ads

ఏదైనా ఒక రంగంలో ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎంతో మంది పోతూ ఉంటారు. క్రికెట్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఎంతో మంది క్రికెట్ లో చాలా సంవత్సరాల పాటు ఆడి, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ కి దూరం అవుతారు.

Video Advertisement

వీరిలో కొంత మంది రిటైర్మెంట్ తర్వాత కూడా కామెంటేటర్లుగా, లేకపోతే కోచింగ్ స్టాఫ్ గా, లేదా ఇంకేదో విభాగంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఎన్నో సమస్యలని ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీలంక మాజీ స్పిన్నర్ అయిన సూరజ్ రందీప్ శ్రీలంక జట్టు తరుపున ఆడారు. 2011 వన్డే ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు కూడా.

this cricketer now became a bus driver

అంతే కాకుండా భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా సూరజ్ ఆడారు. అందులో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగుల స్కోర్ చేశారు. ప్రస్తుతం సూరజ్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ట్రాన్స్‌డెవ్‌ అనే ఒక కంపెనీలో బస్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ అయిన చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ప్లేయర్ అయిన వాడింగ్టన్‌ మ్వేంగా కూడా సూరజ్ తో పాటు అక్కడే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

this cricketer now became a bus driver

ఈ కంపెనీలో దాదాపు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. డ్రైవర్ గా పని చేస్తున్నప్పటికీ కూడా సూరజ్ ఈ ఏడాది టీతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో టెస్టు సిరీస్‌ కి సందర్భం అవుతున్న సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియాకి సహాయం కూడా చేశారు. ఇందులో ఆసీస్ జట్టు సూరజ్ ని నెట్ బౌలర్ గా వినియోగించుకుంది. అంతే కాకుండా సూరజ్ అప్పట్లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా ఆడారు.


End of Article

You may also like