Manjima Mohan: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాడీ షేమింగ్ ఎక్కువైంది. అందులోను సెలబ్రెటీల పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ పెళ్లి చేసుకున్న క్రమంలో మంజిమా మోహన్ పై నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేశారు.
తాజాగా మంజిమా మోహన్ ట్రోల్స్ పై స్పందించారు. మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ గత 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. నవంబర్ 28, 2022న వీరి వివాహం చెన్నైలో కొంతమంది సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ వేడుక జరిగింది. అయితే నటి మంజిమా మోహన్‌కు ట్రోల్స్ కొత్త కాదు. ఈ నేపధ్యంలో మంజిమా మోహన్ తన పై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు. నా వ్యక్తిగత జీవితం పై ఈ ట్రోల్స్ ప్రభావం చూపదని తెలిపారు.
బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.
కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.
అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.
ఇప్పటికే మహేష్‌బాబు,త్రివిక్రమ్‌ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్‌కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్‌బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదు
ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.
డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబీ29 గురించి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు. “మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లాంటి ఓ అడ్వెంచరస్ మూవీ అని, ఇలాంటి మూవీ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇదే దానికి సరైన టైమ్ అనిపించింది. ఈ సినిమాకి మహేష్ బాబునే పర్ఫెక్ట్ ఛాయిస్. ఇలాంటి సబ్జెక్ట్‌కు అతను సూటవుతాడు.ఇది ప్రపంచమంతా చుట్టే ఒక అడ్వెంచరస్ సినిమా అని రాజమౌళి చెప్పాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నాడు.
గతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథను రాయబోతునట్లు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి కూడా అదే కథని చెప్పాడు. యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్స్ అన్ని ఎస్ఎస్ఎంబీ29 లో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ 2023లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ మూవీలో నటించబోయే నటీనటుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్స్లోకి తీసుకెళ్ళే పనుల్లో ఉన్నాడు. అవన్నీ పూర్తయితే కానీ ఎస్ఎస్ఎంబీ29 పై దృష్టి పెట్టే అవకాశాలు లేవు.
హీరో ధనుష్ కు పక్కాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వీరిని ఫైనల్ చేయాల్సి వుంది. ఇక శేఖర్ కమ్ముల స్టైల్ ఎమోషన్లు కూడా చాలా వుంటాయని తెలుస్తోంది. సినిమాలో ధనుష్ పాత్ర కాకుండా మరో ముఖ్య పాత్ర ఉంతుందని సమాచారం. ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
దర్శకుడు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, శేఖర్ కమ్ముల పారితోషికం భారీగా పెరిగిందని సమాచారం. అయితే 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని అంటున్నారు. హీరో ధనుష్ నటించే ఒక్కో సినిమాకు ముప్పై నుండి నలబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా.
నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
అయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్‌లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్‌ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.