తండ్రీ కూతుళ్ళ బంధం లానే తల్లీ కూతుళ్ళ బంధం కూడా ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలు పుట్టిన తరువాత తల్లికి వారే ప్రపంచం అయిపోతారు. ముఖ్యంగా కూతుళ్ళ విషయంలో, వారికి పెళ్లి చేసిన తరువాత ఆ ప్రేమ మరింత ఎక్కువ అవుతుంది. అత్తవారింట్లో వారు ఎలా ఉంటారన్న విషయమై ఆందోళన చెందుతారు. ప్రేమకొద్దీ వారి విషయాల్లో అత్యుత్సహం చూపిస్తారు. పెళ్లి అయ్యిన తరువాత ఎన్నో జాగ్రత్తలు చెప్పి కూతురిని పంపించినా.. కొన్ని విషయాల్లో తల్లులు కూడా పొరపాట్లు చేస్తుంటారు. ఏ తల్లి ఈ ఐదు తప్పులను చెయ్యకూడదు. అవేంటో చూడండి.
#1. పదే పదే కాల్ చేయడం:
పెళ్లి అయ్యాక కూతురుని కచ్చితంగా మిస్ అవుతారు. కానీ, వారు అత్తారింట్లో అడ్జస్ట్ అవడానికి కొంత టైం ఇవ్వాలి. మీరు పదే పదే కాల్ చేసి అక్కడి విషయాలను గుచ్చి గుచ్చి అడగకండి.
#2. ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలనుకోవడం:
పెళ్లి అయిపోయాక కూతురుతో మీ కనెక్షన్ కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. అంతమాత్రాన తన ప్రతి విషయంలో కల్పించుకోవాలి అని చూడకండి. ప్రతి విషయాన్ని మీ కూతురు మీతో షేర్ చేసుకోవాలని , ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలనీ చూడకండి.
#3. రెగ్యులర్ గా కలవడం:
తల్లి తండ్రుల బంధంతో కొంచం గాప్ వస్తేనే ఆమె తన అత్తింట్లో ఇమడగలదు. మీరు పదే పదే వెళ్లి కలవడం, ఆమెని ఇంటికి రమ్మనడం, అత్తింటి వారితో దూరం చేయడం లాంటి పనులు చేయకండి.
#4. పనులు చేయద్దని చెప్పడం:
కూతురు కష్టపడిపోతుందని ఎలాంటి పనులు చేయవద్దు అని పొరపాటున కూడా చెయ్యకండి. కోడలు ఇంటిలో ఏ పనిని పంచుకోకపోతే అది బాధ్యతారాహిత్యమే అవుతుంది. మీరు ఇలాంటి విషయాలు చెప్పి పంపడం వలన ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
#5. అల్లుడిని అవమానించకండి:
నా కూతురు ఇలా అయిపొయింది.. రోజంతా ఆ పనులు ఈ పనులు చేస్తుంది అని చెప్పకండి. అది అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇలా చెప్పడం వలన కూతురికి, అల్లుడికి గొడవలు వస్తాయని గుర్తు పెట్టుకోండి.