శివుని చెల్లెలు ఎవరో తెలుసా? ఆమెను పార్వతి దూరంగా పెట్టమనడానికి కారణం ఇదే.!

శివుని చెల్లెలు ఎవరో తెలుసా? ఆమెను పార్వతి దూరంగా పెట్టమనడానికి కారణం ఇదే.!

by Harika

Ads

బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను త్రిమూర్తులు అని అంటారు.ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించింది బ్రహ్మ అయితే దానిని నడిపించేది మాత్రం విష్ణువు.కాగా మహేశ్వరుడు అంటే ఈ సృష్టికి ఆదియోగి అయిన ఈశ్వరుడు.ఏదైనా కోరికలు ఉంటే విష్ణువును కోరుకునే అవకాశం ఉంది గాని అన్నింటి కంటే గొప్పదైన మోక్షాన్ని ఇవ్వాలంటే ఆ అధికారం ఉంది మాత్రం ఒక్క శివుడికే.

Video Advertisement

మళ్ళీ తిరిగి జన్మలు వస్తే మళ్ళి మానవుడు ఈ సుఖ దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది.కాబట్టి ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన మోక్షాన్ని ఇచ్చేది శివుడు.అందుకే ఆయనను కైవల్య నాధుడు అని కూడా పిలుస్తారు.అయితే ఈశ్వరుడికి దేవి అశావ‌రి అనే చెల్లెలు ఉంది.కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.ఆ కథ ఏంటో చూడండి.

పార్వతి ,ఈశ్వరుడికి పెళ్లి అయ్యిన తర్వాత ఇద్దరు కలిసి కైలాసంలో నివాసం ఉంటారు.కైలాసంలో ఈశ్వరుడు ఎక్కువగా ధాన్యంలో ఉండేవారు ఆ సమయంలో పార్వతి ఒంటరిగా ఉండడంతో కొంచెం నిరాశకు గురి అయ్యేది .ఎవరితోనైనా మాట్లాడదాం అంటే కైలాసంలో అందరూ మొగవారే ఉంటారు.దీంతో తన భావాలను పంచుకోవడానికి నాకు ఒక ఆడ తోడు కావాలి అని పార్వతి ఈశ్వరుడికిని కోరుతుంది.దీంతో ఈశ్వరుడు తన అంశ ఐన అశావ‌రి అనే అమ్మాయి ని తన నుండి సృష్టిస్తాడు.అశావ‌రి కూడా పులిచర్మంతో బష్మం ధరించి ఈశ్వరుడి లాగానే ఉంటుంది.అప్పటి నుండి పార్వతి అశావ‌రితో స్నేహంగా మెలుగుతోంది.

కానీ అశావ‌రికి ఆకలి బాగా ఎక్కువ దీనితో కైలాసం లో ఉన్న ఆహారం అంత అయిపోతూ ఉంటుంది.కావున కైలాసం లో మిగతావారి ఎవరికీ ఆహారం లేక బాధపడుతూ ఉంటారు.దీనికితోడు అశావ‌రి చాలా కోపంగా ,మొండిగా ఉంటుంది.దీంతో పార్వతి అశావ‌రి ని భరించలేక తనను ఇక్కడి నుండి ఎక్కడికైనా పంపించాల్సిందిగా కోరుతుంది.కాగా నేనే మిమల్ని ఒక అమ్మాయి కావాలని కోరుకుని తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని పార్వతి ఈశ్వరుడితో చెప్తుంది.దీంతో ఈశ్వరుడు అశావ‌రిని తిరిగి తనలో కలిపేసుకుంటాడు. అది శివుని చెల్లెలు కథ.


End of Article

You may also like