కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన 8 మరణ రహస్యాలు.. మరణానికి ముందు ఏమి జరుగుతుందంటే..!

కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన 8 మరణ రహస్యాలు.. మరణానికి ముందు ఏమి జరుగుతుందంటే..!

by Sainath Gopi

Ads

మనందరికీ మరణమే తుది దశ అని తెలిసిందే. పుట్టిన వారు మరణించాక తప్పదు అని అంతటి శ్రీకృష్ణులవారే మనకి గీతలో సెలవిచ్చారు. అయితే.. మనలో చాలా మందికి మరణం సంభవించే ముందే కొన్ని సూచనలు వస్తుంటాయి. కొందరు ఆధ్యాత్మిక భావనల ద్వారా దానిని తెలుసుకోగలుగుతారు. మరికొందరు.. భౌతికం గా కూడా కొన్ని సంకేతాల ద్వారా పసిగట్టవచ్చు. వీటి గురించి శివపురాణం లో కూడా వివరించారు.

Video Advertisement

death secret

శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది.. “స్వామి..! మరణానికి సంకేతం ఏమిటి, మరణం జరగబోతోందని ఎలా తెలుస్తుంది.. ఎవరైనా ఓ వ్యక్తి మరణానికి ముందు ఏమి జరగవచ్చు..?” అని ప్రశ్నించగా.. అందుకు పరమేశ్వరుడు మరణం గురించి ప్రతిదీ వివరించాడని చెబుతారు. శివుని మాటల ప్రకారం, ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు మరియు కొద్దిగా ఎరుపుగా మారినప్పుడు.. ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని అర్ధం. ఇంకా శివ పురాణం లో ఏమి చెప్పబడిందంటే..

shiva parvathi 2

#1 నీరు, నూనె మరియు అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు, ఆ వ్యక్తి 6 నెలల కాలంలో చనిపోతాడనడానికి ఇది సంకేతం. ఒకవేళ, ఎవరైనా తమ మరణ సమయం కంటే ఒక నెల ఎక్కువ జీవిస్తే, వారు తమ సొంత నీడలను చూడలేరు. ఒకవేళ చూసినా.. ఆ నీడ కి తల భాగం ఉండదు.

#2 ఎవరికైనా ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుంటే.. ఆ వ్యక్తి కూడా త్వరలోనే లోకాన్ని వీడబోతున్నారని అర్ధం. అలాగే కనీసం వారం రోజుల పాటు ఓ వ్యక్తి ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా.. అతను మరణించబోతున్నాడని అర్ధం.

#3 ఒక వ్యక్తి నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టి గా మారిపోయినట్లు అనిపిస్తే.. ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో మరణించబోతున్నాడని అర్ధం.

shiv parvathi

#4 ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని యొక్క కాంతిని చూడలేనప్పుడు, ఆ వ్యక్తి 6 నెలలు మాత్రమే సజీవంగా ఉండబోతున్నాడని అర్ధం.

#5 ఒక వ్యక్తి యొక్క నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాలు చీమును స్రవించడం ప్రారంభిస్తే, ఆ వ్యక్తి 6 నెలలకు మించి బతకడు అనడానికి ఇది సంకేతం.

#6 ఆకాశం లో ఉండే ధ్రువ నక్షత్రం కంటికి కనిపించకపోయినా.. ఆ వ్యక్తి మరో ఆరునెలల్లో మరణించవచ్చని చెప్పవచ్చు.

#7 ఒక వ్యక్తి సూర్యుడు, చంద్రుడు మరియు ఆకాశాన్ని కూడా ఎరుపు రంగులోనే చూస్తే, మరో ఆరు నెలల్లో అతను మరణించవచ్చని చెప్పవచ్చు.

#8 ఒక వ్యక్తి గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు లేదా ఏదైనా గ్రామాన్ని ఖాళీ గా, వినాశనం చేయబడిన గ్రామాన్ని చూసినపుడు.. అతనికి మరణం దగ్గరలోనే ఉందని తెలుస్తుంది..

shiva parvathi

ఇవి కేవలం చూచాయ గా చెప్పగలిగేవి మాత్రమే. ఈ మరణ రహస్యాలను డీకోడ్ చేసుకుని అన్వయించుకోవడం చాలా కష్టం. ధర్మ గ్రంథం ప్రకారం, మరణం తరువాత, వ్యక్తి యొక్క ఆత్మ ఆ వ్యక్తి జీవితంలో చేసిన పనులను బట్టి స్వర్గంలో లేదా నరకంలో స్థానం పొందుతుంది. హిందూ నమ్మకాల ప్రకారం, మరణం తరువాత, 84 లక్షల ఆత్మలలో ఒక ఆత్మ మాత్రమే శరీరాన్ని కనుక్కోగలదు. ఎవరైనా, మృతదేహాన్ని ఎత్తే వ్యక్తుల గురించి కలలుగన్నట్లయితే, సమీప భవిష్యత్తులో ఆ వ్యక్తికి చాలా డబ్బు లభిస్తుందని ఈ కల అంతరార్ధం. ఒక వ్యక్తి తన కలలో ఒకరిని చంపడం చూస్తే, ఆ వ్యక్తి తన సన్నిహితుడికి ఎక్కువ గా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అర్ధం.


End of Article

You may also like