హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా అరచేతిలో ఉండే రేఖలు లేదా గీతల ద్వారా వ్యక్తుల యొక్క జాతకాలను అంచనా వేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అరచేతిలోని గీతలు, భవిష్యత్తును సూచిస్తాయని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు.
అయితే అరచేతిలో ఉంటే పుట్టుమచ్చల ద్వారా కూడా మనుషుల యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవచ్చని హస్త సాముద్రిక నిపుణులు చెబుతున్నారు. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు వేటిని సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం..
హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలోని జీవనరేఖ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అంత శుభకరం కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పుట్టుమచ్చ హృదయరేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు ఆరోగ్యపరంగా మంచిది కాదట. అంతేకాక అశుభంగా కూడా పరిగణిస్తారట. పుట్టుమచ్చ కనుక అదృష్ట రేఖ మీద ఉంటే ఆ జాతకుల జీవితం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అలజడికి లోనవుతుందట.
అంతేకాకుండా అరచేతిలోని వివాహ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తులకు పెళ్ళికి సంబంధించిన అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలో సూర్య పర్వతం మీద పుట్టు మచ్చ ఉన్నట్లయితే అది ఆ వ్యక్తులకు అశుభంగా పరిగణిస్తారట. ఇలా ఉండడం వల్ల ఆ వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇతరులు చేసిన తప్పులకు చాలాసార్లు ఈ వ్యక్తులు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
పుట్టుమచ్చ అరచేతిలో ఉండే బుధ పర్వతం మీద ఉంటే ఆ వ్యక్తులకు నష్టాలు కలుగుతాయని సూచిస్తున్నారు. పుట్టుమచ్చ అరచేతిలోని విధి రేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ వ్యక్తులు జీవితాంతం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చేసే పని విషయంలోనూ మరియు ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: మీ నాలుక రంగుని బట్టి మీకున్న అనారోగ్య సమస్యని గుర్తించచ్చు…ఎలాగో తెలుసా.?




మహామహిమాన్వితమైన అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో అలంపూర్ జోగులాంబ దేవాలయం ఒకటి. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండలానికి చెందిన గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు పాత మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ మండలంలో ఉండేది. ఇది కర్నూలు నుంచి 25 కి. మీ. దూరంలో ఉంది. ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ పట్టణంలో జోగులాంబ ఆలయం ప్రముఖంగా ఉంది.







తల్లి కావడం కోసం సరి అయిన వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య గర్భధారణ మంచిదని గైనకాలజిస్టు డాక్టర్ నందినీ పాల్షేత్కర్ అన్నారు. అయితే 35 సంవత్సరాల తర్వాత తల్లి అయితే చాలా సమస్యలు ఎదురవుతాయని, అందుకే 25 నుంచి 35 సంవత్సరాలు గర్భధారణ సరైన వయసని ఆమె చెప్పారు.
వయసు మహిళల్లో అండాల సంఖ్య మీద ప్రభావం చూపిస్తుంది. ఇక వయసు పెరుగుతున్నకొద్ది మహిళల్లో అండాల సంఖ్య తగ్గుతుందని ఎన్నో పరిశోధనల్లో తెలిసింది. పురుషుల్లో శుక్రకణాలు రోజూ ఉత్పత్తి అవుతుంటాయి. అయితే మహిళల్లో పది లక్షల అండాలు మాత్రమే ఉంటాయి. రజస్వల అయ్యే టైంకి అండాలు సంఖ్య 3,00,000 పరిమితం అవుతుంది. 37 సంవత్సరాలకు మహిళల్లో అండాల సంఖ్య 25,000కు తగ్గుతాయి. 51 సంవత్సరాలకు అండాల సంఖ్య 1000 మాత్రమే.
వయసు పెరుగుతున్నకొద్ది అండాల సంఖ్య తగ్గడం మాత్రమే కాకుండా అండాల నాణ్యత తగ్గిపోతుంది. ఆలస్యంగా తల్లి కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల ఆ ప్రభావం తల్లి పైన, బిడ్డ పైన దుష్ప్రభావం పడుతుంది. మొదటి ముడు నెలలు అబార్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి. డయాబెటిస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.





చట్ట ప్రకారం వివాహం జరిగిన తరువాత భార్య లేదా భర్త నుండి విడాకులు రాకుండా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అవుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక IPC సెక్షన్ 494 ప్రకారం బైగమీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు రెండవ వివాహం చెల్లదు. అంటే చట్ట ప్రకారం పెళ్లి జరిగిన తరువాత ఆ వ్యక్తి ఇంకొక పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా విడాకులు రావాల్సిందే.
ఈ విషయం తెలియక చాలా మంది, లేదా ఏం చేస్తారులే అనుకుని రెండవ పెళ్లి చేసుకుంటుంటారు. ఒకవేళ భార్య లేదా భర్త రెండవ పెళ్లి చేసుకున్న భర్త లేదా భర్త మీద కేసు నమోదు చేసే హక్కు ఉంటుందని వెల్లడించారు. అలాంటి సమయంలో రెండవ పెళ్లి చేసుకున్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షపడుతుంది.
హిందూ వివాహచట్టం ప్రకారంగా డైవర్స్ కోరుతూ దాఖలైన పిటిషన్ను ఒప్పుకుంటూ భర్త లేదా భార్య ప్రమాణ పత్రాన్ని ఇచ్చినట్లు అయితే వారి పెళ్లి రద్దువుతుంది. కానీ, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నా రెండవ వివాహం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి
