PEDDHA KAPU 1 REVIEW : “శ్రీకాంత్ అడ్డాల” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

PEDDHA KAPU 1 REVIEW : “శ్రీకాంత్ అడ్డాల” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో, తనదైన స్టైల్ టేకింగ్ తో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. శ్రీకాంత్ అడ్డాల సినిమాలు అన్నీ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. బ్రహ్మోత్సవం తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని పెదకాపు-1 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : పెదకాపు-1
  • నటీనటులు : విరాట్ కర్ణ, రావు రమేష్, ప్రగతి శ్రీవాస్తవ.
  • నిర్మాత : మిరియాల రవీందర్ రెడ్డి
  • దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
  • సంగీతం : మిక్కీ జే మేయర్
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2023

peddha kapu 1 movie review

స్టోరీ :

గోదావరి నది దగ్గర ఉన్న లంక అనే ఒక గ్రామంలో కథ మొత్తం నడుస్తుంది. అక్కడే నివసించే పెదకాపు (విరాట్ కర్ణ) అణిచివేతకి గురి అయ్యే వర్గానికి చెందినవాడు. ఆ వర్గం వారు, అలాగే ఆ ఊరిలో ఉండేవారు అందరూ కూడా ఇద్దరు రాజకీయ నాయకులు అయిన సత్య రంగయ్య (రావు రమేష్), బాయన్న (ఆడుకలం నరేన్) అనే ఇద్దరు వ్యక్తుల గొడవల మధ్య ఇరుక్కుపోతూ ఉంటారు.

peddha kapu 1 movie review

వీరందరి సమస్యలని తీర్చడానికి వారి వర్గానికి చెందిన పెదకాపు తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడతాడు. అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? తర్వాత అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? తన ప్రజల పరిస్థితులని బాగు చేయగలిగాడా? నాయకుడు అయ్యే క్రమంలో అతను ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

peddha kapu 1 movie review

రివ్యూ :

కొత్త బంగారులోకం సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన శ్రీకాంత్ అడ్డాల ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ టేకింగ్ తో ముందుకు వెళ్లారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద ఇవన్నీ కూడా సామాన్య ప్రజల సమస్యలు, వారి బంధాలు వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మోత్సవం సినిమా బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ ఎమోషన్స్ అయినా కూడా చూపించడంలో కాస్త తన మార్క్ లేకపోవడంతో సినిమా ప్రేక్షకులని నిరాశపరిచింది.

peddha kapu 1 movie review

ఆ తర్వాత రీమేక్ సినిమా అయిన నారప్ప సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒరిజినల్ సినిమాని దాదాపు మొత్తం అలాగే చేశారు కాబట్టి శ్రీకాంత్ అడ్డాల మార్క్ ఉందా లేదా అనే విషయాన్ని చెప్పే అవకాశం లేకపోయింది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, పెదకాపు సినిమా అంతా 1980 టైంలో నడుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కూడా తమిళ్ సినిమాలు బాగా చూసేవారు అయితే అక్కడ ఇలాంటి కుల వివక్ష మీద, అలాంటి ఊళ్ళలో ఉండే రాజకీయాల మీద ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్ వెట్రిమారన్ స్టైల్ టేకింగ్ గుర్తొస్తోంది అనుకుంటారు.

peddha kapu 1 movie review

తెలుగు సినిమాల్లో అయితే కాస్త రంగస్థలం గుర్తొస్తుంది. డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పారు. కాకపోతే చెప్పే విధానంలో మాత్రం కొన్ని చోట్ల ఫ్లాట్ గా అయిపోయింది. అప్పట్లో కుల వివక్ష అనేది చాలా ఎక్కువగా ఉండేది అనే విషయం అందరికీ తెలుసు. అయితే అలాంటి ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా అంతే లోతుగా చూపించి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. బహుశా మన ప్రేక్షకులు అలాంటివి రిసీవ్ చేసుకుంటారా లేదా అనే అనుమానం కూడా దర్శకుడికి ఉండే అవకాశం ఉంది.

peddha kapu 1 movie review

కుల వివక్ష, రాజకీయాలు ఈ రెండు అంశాలు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వలేకపోయాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోగా నటించిన విరాట్ కర్ణ తన మొదటి సినిమా అయినా కూడా బాగా నటించారు. ఇలాంటి ఒక పాత్రకి ఒక కొత్త హీరోని తీసుకుందాము అనే దర్శకుడు ఆలోచన బాగుంది. కాకపోతే ఆ పాత్రని ఇంకా కొంచెం జాగ్రత్తగా రాసుకొని ఉంటే బాగుండేది. హీరోయిన్ గా నటించిన ప్రగతి కూడా తన పాత్ర వరకు నటించారు. సినిమాలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వారి అందరి పాత్రలని కూడా బాగా రాసుకోలేదు ఏమో అనిపిస్తుంది.

peddha kapu 1 movie review

సినిమాకి మరొక హైలైట్ రావు రమేష్. అసలు ఆయన పాత్రకి మాటలు లేవు. సినిమా మొత్తం ఎక్స్ప్రెషన్స్ తోనే నటించారు. ఒక నటుడికి ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు ఆ నటుడు ఎంత బాగా నటించగలరు అనేది తెలుస్తుంది. ఇందులో రావు రమేష్ సక్సెస్ అయ్యారు. మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన నాగబాబు, రాజీవ్ కనకాల, అక్కయ్య పాత్రలో నటించిన అనసూయ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

peddha kapu 1 movie review

పాటలు కూడా గొప్పగా లేకపోయినా పర్వాలేదు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. 1980 టైంని కళ్ళకి కట్టినట్టుగా తెర మీద చూపించారు. కెమెరా వర్క్, కలర్ గ్రేడింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నెగిటివ్ పాత్రలో నటించిన శ్రీకాంత్ అడ్డాల కూడా మొదటి సినిమా అయినా కూడా బాగా నటించారు. అంతే కాకుండా సినిమా చివరిలో వచ్చే తెలుగుదేశం పార్టీ గురించి, ఆ పార్టీ గొప్పదనం గురించి చెప్పిన సీన్ బాగా చూపించారు.

ప్లస్ పాయింట్స్ :

  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • నటీనటులు
  • సెట్ డిజైన్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • బలహీనంగా ఉన్న స్క్రీన్ ప్లే
  • కాస్త సాగదీసినట్టుగా ఉన్న ఫస్ట్ హాఫ్
  • పాత్రలని రాసిన విధానం
  • లాజిక్ మిస్ అయిన సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి కాన్సెప్ట్ ని ఎలా హ్యాండిల్ చేశారు అని చూద్దాం అని అనుకునే వారికి పెదకాపు-1 సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “ఇది కదా మాస్ అంటే..?” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” టీజర్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like