అరచేతిలో పుట్టుమచ్చ ఉందా..? అయితే మీ జీవితం ఎలా ఉంటుంది అంటే..?

అరచేతిలో పుట్టుమచ్చ ఉందా..? అయితే మీ జీవితం ఎలా ఉంటుంది అంటే..?

by kavitha

Ads

హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా అరచేతిలో ఉండే రేఖలు లేదా గీతల ద్వారా వ్యక్తుల యొక్క జాతకాలను అంచనా వేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అరచేతిలోని గీతలు, భవిష్యత్తును సూచిస్తాయని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు.

Video Advertisement

అయితే అరచేతిలో ఉంటే పుట్టుమచ్చల ద్వారా కూడా మనుషుల యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవచ్చని హస్త సాముద్రిక నిపుణులు చెబుతున్నారు. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు  వేటిని సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం..
హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలోని జీవనరేఖ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అంత శుభకరం కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పుట్టుమచ్చ హృదయరేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు  ఆరోగ్యపరంగా మంచిది కాదట. అంతేకాక అశుభంగా కూడా పరిగణిస్తారట. పుట్టుమచ్చ కనుక అదృష్ట రేఖ మీద ఉంటే ఆ జాతకుల జీవితం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అలజడికి లోనవుతుందట.
అంతేకాకుండా అరచేతిలోని వివాహ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తులకు పెళ్ళికి సంబంధించిన అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలో సూర్య పర్వతం మీద పుట్టు మచ్చ ఉన్నట్లయితే అది ఆ వ్యక్తులకు అశుభంగా పరిగణిస్తారట. ఇలా ఉండడం వల్ల ఆ వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇతరులు చేసిన తప్పులకు చాలాసార్లు ఈ వ్యక్తులు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
పుట్టుమచ్చ అరచేతిలో ఉండే బుధ పర్వతం మీద ఉంటే ఆ వ్యక్తులకు నష్టాలు కలుగుతాయని సూచిస్తున్నారు. పుట్టుమచ్చ అరచేతిలోని విధి రేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ వ్యక్తులు జీవితాంతం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చేసే పని విషయంలోనూ మరియు ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: మీ నాలుక రంగుని బట్టి మీకున్న అనారోగ్య సమస్యని గుర్తించచ్చు…ఎలాగో తెలుసా.?


End of Article

You may also like