శరీరంలో ఉండే అన్ని అవయవాలలో అన్నిటి కంటే కళ్ళు ప్రధానమైనవి. అయితే కళ్ళు తరువాత నాలుక చాలా ముఖ్యమైనది నాలుక. అయితే డాక్టర్ దగ్గరకు ఆరోగ్యం బాగోలేదని వెళ్ళినప్పుడు కళ్లుతో పాటు నాలుకను కూడా చెక్ చేస్తారు.

Video Advertisement

ఎందుకంటే నాలుక రంగును బట్టి మన ఆరోగ్య పరిస్థితి చెప్పవచ్చు. నాలుక రంగు దేనికి సంకేతిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం, సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి యొక్క నాలుక గులాబీ రంగు తో పాటు తెల్ల పూత ఉంటుంది. ఎప్పుడైతే నాలుక రంగు నారింజ రంగులో మారుతుందో దాని అర్థం నోటి పరిశుభ్రత లేకపోవడం లేక నోరు పొడిబారిపోయింది అని అర్థం.

కెఫిన్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మరియు పరిమితికి మించి పొగత్రాగడం వలన నాలుక రంగు గోధుమ రంగులోకి మారుతుంది.నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల నాలుక పై చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది దాంతో నాలుక పసుపు రంగులోకి మారుతుంది. ఇలా జరగడానికి ఇంకొక కారణం ఉంది, అదేమిటంటే జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు మరియు కాలేయ సమస్యతో బాధపడుతున్న వారి నాలుక పసుపు రంగులోకి మారుతుంది.

 

ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు నాలుక నలుపు రంగులోకి మారుతుంది. జుట్టు, గోళ్ళు మరియు చర్మం లో ఉండే కెరటిన్ అనే ప్రోటీన్ పేరుకుపోవడం వల్ల కూడా నాలుక నల్లగా మారుతుంది.జ్వరం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు టెంపరేచర్ తో పాటు నాలుకను కూడా చూస్తారు. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ల తో జ్వరం వచ్చినప్పుడు నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ డి లోపం ఉన్నా సరే నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.

నాలుక తెలుపు రంగులో ఉంటే సీజనల్ వ్యాధులు, డిహైడ్రేషన్, ఐరన్, ప్రోటీన్ మరియు హెమోగ్లోబిన్ లోపంకు సంకేతం. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో సరైన ప్రొటీన్లు ఉండేటట్టు చూసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు.