సాధారణంగా మనం చాలా ప్రదేశాల్లో నీటి మధ్యలో బ్రిడ్జ్ ని చూసే ఉంటాం. అందరికీ “అవి ఎలా కడతారు?” అని అనుమానం కూడా వచ్చే ఉంటుంది. అలా నీటి మధ్యలో బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నీటిలో బ్రిడ్జ్ కట్టడానికి డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతారు. నీళ్లు లోతు, ఇంకా సాయిల్ క్వాలిటీ ని బట్టి ఏ టెక్నిక్ వాడాలో నిర్ణయించుకుంటారు.
#1 మొదటి టెక్నిక్ నీటి లోతు తక్కువగా ఉన్న చోట బ్రిడ్జ్ కట్టడం. ముందు టెంపరరీ పీరియడ్ వరకూ ఒక ఫౌండేషన్ వేస్తారు. తర్వాత దాని మీద పైర్స్ అనే ఒక రకమైన స్తంభాలను నిర్మిస్తారు. ఒకవేళ బ్రిడ్జి యొక్క టాప్ లేయర్ కన్స్ట్రక్ట్ చేయడానికి సాయిల్ అనుకూలంగా లేకపోతే, తాత్కాలికంగా రిగ్ లు ఏర్పాటు చేసి, రివర్ బెడ్ మీద పైర్స్ నిర్మిస్తారు. ఇలా ముందే నిర్మించిన పైర్స్ సహాయంతో కానీ, టెంపరరీ ఫ్లాట్ ఫామ్ సహాయం తో కానీ, నీటిలో ఉండే మడ్ ఐలాండ్ ద్వారా కానీ, చాలా రేర్ కేసెస్ లో బార్జ్ ల ద్వారా గాని బ్రిడ్జ్ నిర్మిస్తారు.
#2 ఇంకొక టెక్నిక్ లోతుగా ఉన్న నీరు అంటే నది లేదా సముద్రంలో బ్రిడ్జ్ నిర్మించడం. ఇందులో కాఫర్ డామ్ టెక్నిక్ వాడతారు. ఈ టెక్నిక్ లో ఒక ఏరియా క్లోజ్ అయ్యేలాగా ఒక వాల్ కడతారు. ఆ ఏరియా నుండి నీటిని బయటికి తీస్తారు. దీన్ని కాఫర్ డామ్ అంటారు.
ఈ కాఫర్ డామ్ లోపల బ్రిడ్జ్ యొక్క పిల్లర్స్ నిర్మిస్తారు. బ్రిడ్జ్ కట్టే చోటు నది లేదా సముద్రం కాబట్టి 24 గంటలు కాఫర్ డామ్ బయట ఎత్తైన అలలు వస్తాయేమోనని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ టెక్నిక్ ద్వారా నిర్మించిన బ్రిడ్జ్ లు బలంగా, ఎక్కువ లోడ్ మోసేలా ఉంటాయి.
#3 ఇంకొక టెక్నిక్ కేస్ డ్రిల్లింగ్. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇందులో ఎయిర్ ప్రెజర్ సహాయంతో ఒక వాటర్ టైట్ ఛాంబర్ కడతారు. తర్వాత ఈ ఛాంబర్ లో సీల్ చేసి ఉన్న ఒక ట్యూబ్ ఛాంబర్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ట్యూబ్ లోపలికి ఒక లాంగ్ డ్రిల్ పెట్టి డ్రిల్లింగ్ చేస్తారు.
ఈ ప్రాసెస్ లో, నిండిన నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అలా డ్రిల్ చేసిన చోట ఒక కేస్ అమర్చుతారు. అలా ఒక ఫ్రేమ్ తయారవుతుంది. ఆ ఫ్రేమ్ లో కాంక్రీట్ నింపుతారు. తర్వాత పిల్లర్స్ కట్టి, బ్రిడ్జ్ నిర్మిస్తారు.