ఈ ఆటతో వరల్డ్ కప్ కష్టమే.? ఫాన్స్ తో పాటే ఇండియా టీం కూడా “ధోని”ని మిస్ అవుతుందా.?

ఈ ఆటతో వరల్డ్ కప్ కష్టమే.? ఫాన్స్ తో పాటే ఇండియా టీం కూడా “ధోని”ని మిస్ అవుతుందా.?

by Sainath Gopi

Ads

మొహాలీ వేదికగా టీమిండియాకి ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 208 పరుగుల స్కోర్ చేసింది. రెండవ టీ 20 నాగపూర్ వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతుంది.

Video Advertisement

హార్దిక్ పాండ్య (71 నాటౌట్: 30 బంతుల్లో 7×4, 5×6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (55: 35 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ నమోదు చేశారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (46: 25 బంతుల్లో 2×4, 4×6) కూడా మంచి స్కోర్ చేశారు. ఆస్ట్రేలియా జట్టు బౌలర్లలో నాథన్ ఎలిస్ మూడు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు. 209 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడింది.

కెప్టెన్ అరోన్ ఫించ్ (22: 13 బంతుల్లో 3×4, 1×6) నాలుగో ఓవర్‌ లోనే అవుట్ అయిపోయారు. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (61: 30 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (35: 24 బంతుల్లో 3×4, 1×6) చేయగా, గ్లెన్ మాక్స్‌వెల్ (1), జోష్ ఇంగ్లీస్ (17), టిమ్ డేవిడ్ (18) చేశారు. ఒక ఎండ్ లో క్రీజ్ లో నిలిచిన మాథ్యూవెడ్ (45 నాటౌట్: 21 బంతుల్లో 6×4, 2×6) చివరిలో ఆస్ట్రేలియా ని గెలిపించారు.

ఆసియా కప్ లో కూడా భారత్ ఎంత గోరంగా పరాజ్యమైందో అందరికి తెలిసిందే. డెత్ ఓవర్లులో అత్యంతంగా చెత్త బౌలింగ్ తో డిఫెండ్ చేయలేకపోయారు. అటు బౌలింగ్ లో ఫెయిల్ అయ్యారు..ఇక ఫీల్డింగ్ లో అనేక క్యాచ్ లు వదిలేస్తున్నారు. ఇక టీం ఇండియా ఇలాగే ఆడితే ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక టీ 20 వరల్డ్ కప్ లో లీగ్ స్టేజిలోనే మనోళ్లు వెనక్కి వచేస్తారో ఏమో ఇలా ఆడితే అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో “ధోని” ని గుర్తు చేసుకుంటూ కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. ధోని ఉండుంటే టీం ఇలా ఉండేది కాదు అంటూ. ఒక ఫినిషర్ గా ధోని ఎన్ని మ్యాచ్ లు గెలిపించాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ధోని క్రీజ్ లో ఉన్నప్పుడు చివరి ఓవర్ లో 15 పరుగులు కొట్టాలంటే ప్రెషర్ ధోనీపై కాదు ఆ బౌలర్ పై ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

2007 వరల్డ్ కప్ లో చివరి 2 బంతుల్లో ఒక పెరుగుని డిఫెండ్ చేసి మ్యాచ్ డ్రా చేసి…బౌల్ అవుట్ లో తన ప్రతిభతో విజయాన్ని అందించాడు ధోని. అలాగే బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో సమయస్ఫూర్తితో గ్లోవ్స్ తీసేసి రన్ అవుట్ చేసి గెలిపించాడు. ఇంక ధోని మాస్టర్ మైండ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఇకనైనా టీం ఇండియా తప్పిదాలను అధిగమించి టీ 20 ప్రపంచ కప్ పై ద్రుష్టి పెడితే బాగుంటుంది అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like