మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిపోతుంది. ప్రస్తుతం టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. టైటిల్ సన్నీకి రావచ్చు అని టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కాజల్ విషయానికి వస్తే ఇన్ని రోజులు నుంచి కూడా కాజల్ హౌస్ లో ఉండి గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.
నిజానికి ఆమె ఎలిమినేట్ అవ్వడం అభిమానులకి నచ్చలేదు. తప్పకుండా కాజల్ టాప్ ఫైవ్ లో ఉంటుందని అనుకున్నారు. ఆమె కూడా టాప్ ఫైవ్ లో ఉండడానికి చాలా కష్టపడింది. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఆమె వెళ్లి పోవాల్సి వచ్చింది. తను అనుకున్నది పూర్తి చేయకుండా ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మొదట్లో కాజల్ కి హౌస్ నుండి చాలా నెగిటివిటీ వచ్చింది.
తర్వాత ఆమె గేమ్ మీద ఫోకస్ పెట్టింది. అయితే సోషల్ మీడియాలో వినపడుతున్న వార్తల ప్రకారం చూసుకున్నట్లయితే కాజల్ వారానికి రెండు లక్షల వరకు తీసుకుందని తెలుస్తోంది. అంటే 14 వారాలకే ఆమె ఏకంగా 30 లక్షల రూపాయలు ఆమె తీసుకుంది. అయితే తక్కిన వారితో పోల్చుకుంటే మాత్రం ఆమెకి తక్కువ రెమ్యునరేషన్ వచ్చింది.
Also Read: Bigg Boss 5 Telugu Final Voting | Bigg Boss 5 Telugu Final Voting Poll Results