పాత నాణేలతో లక్షాధికారి అయ్యిపోవచ్చా..? వాటిలో అంత స్పెషాలిటీ ఏముంది…?

పాత నాణేలతో లక్షాధికారి అయ్యిపోవచ్చా..? వాటిలో అంత స్పెషాలిటీ ఏముంది…?

by Megha Varna

Ads

పాత నాణేలు ఉంటే లక్షాధికారి అయిపోవచ్చు, ధనవంతులు అయిపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి అన్ని నాణేలు ధనవంతులని చేయవు. చాలా అరుదైన నాణేలు మాత్రమే ఎక్కువ పలుకుతాయి. ఈ సంవత్సరం జూన్ లో చూసుకున్నట్లయితే ఒక నాణెం ప్రపంచం మొత్తం వార్తల్లో నిలిచింది. అయితే మరి దానిలో స్పెషాలిటీ ఏమిటి అనేది చూస్తే…

Video Advertisement

వేలంలో ఈ నాణెం 20 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. దీని పేరు వచ్చేసి డబల్ డేగా. అఫీషియల్ గా అమెరికా లో విడుదలైన ఆఖరి బంగారు నాణెం ఇది. 1933లో విడుదలైన కొన్ని రోజులకి ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకుంది. కొన్ని ఇప్పటికీ మనుగడలో ఉన్నాకూడా వాటి విలువ కోట్లలో ఉంది.

ఆ కాలంలో జరిగిన ఏదైనా సంఘటన లేదా మార్పులకి సంబంధం కుదర్చచ్చు.అందుకే వాటికి ఎక్కువ ధర ఇస్తారు.  ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో వేలంలో ఇరవై డాలర్ల నోటు ధర 57 వేల డాలర్లు పలికింది. అయితే ఎందుకు దీనికి అంత ధర పలికింది అనేది చూస్తే… ఒక స్టిక్కర్ పొరపాటున కాగితంపై పడిపోయింది.

అది కూడా ఆ ప్రింట్ అయిపోయింది. అయితే ఏటీఎం ద్వారా ఈ నోట్ ఒక విద్యార్థికి వచ్చింది. సాధారణంగా ప్రింటింగ్ లో తప్పులు జరిగితే దానిని ఎర్రర్ నోట్స్ అంటారు. ఇవి రేర్ గా జరుగుతాయి. పొరపాటున వచ్చి ఇవి విలువైనవిగా మారిపోతాయి ఎంత పెద్ద తప్పు ఉంటే అంత ఎక్కువ ధర దానికి పలుకుతుంది.


End of Article

You may also like