అనార్కలి పేరు అందరికీ సుపరిచితమే. మొగల్ చక్రవర్తుల సంస్థానంలో చెలికత్తె బాల్య జీవితాన్ని ఈమె గడుపుతూ ఉండేది. అయితే అలా ఉంటున్న సలీంతో ప్రేమలో పడింది.
ఈ విషయం తెలిసిన అక్బర్ అనార్కలి నాలుగు గోడల మధ్య సమాధి చేస్తాడు. దీనితో కధ ముగుస్తుంది. అయితే నిజానికి ఇది వట్టి కథ మాత్రమే. దీనిలో నిజం లేదు అని చరిత్రకారులు అంటున్నారు. పైగా అనార్కలి నిజంగా ఉందనడానికి సాక్ష్యాలు ఏమీ లేవు. ఆమె సమాధిగా చెప్పబడుతున్న నిర్మాణం కూడా నిజమైనది కాదు.
సలీం నిజంగా ప్రేమికుడు కాదు. మహిళలను వేధించే కసాయి. సలీం గురించి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మరి వాటి కోసం చూసేయండి. అక్బర్ పెద్ద కుమారుడైన సలీంకి మరొక పేరు కూడా ఉంది. అదే జహంగీర్. అతనికి ఉన్న భార్యల సరిపోరని మూడు వందల మందితో సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇతని మొదటి భార్య పేరు మన్భవతి బాయి. ఖుస్రూ మిర్జా అనే కొడుకు కూడా జన్మించాడు. మన్భవతి బాయి పేరు షా బేగం గా మారింది.
ఆ తర్వాత ఫుల్ బేగం అనే ఒక యువతిని వివాహం చేసుకున్నాడు జహంగీర్. జోద్ బాయి మూడో భార్య. ఈమెకి జగత్ గొసెయిన్ అనే పేరు కూడా ఉంది. ఇది ఇలా ఉంటే బికనీర్ మహారాజు కుమార్తెను 1586 జూలైలో నాలుగో వివాహం చేసుకున్నాడు. ఈమె 1592లో మరణించింది. షాహిబ్ ఇ జమాల్ అనే మరో మహిళను 6వ వివాహం చేసుకున్నాడు.
ఈమె పర్వీజ్ మిర్జాని పెళ్లి చేసుకుంది. ఈమె కూడా మరణించింది. మలికా ఇ జహాన్ బేగం సాహిబా అనే మహిళను, రాజా దర్యా మల్భాస్ కుమార్తెను, అబియా కాశ్మీరి అనే మహిళ సోదరిని, కన్వాల్ రాణిను, హుస్సేన్ చాక్ అనే రాజు కుమార్తెను, సాలిహా బాను బేగం అనే మహిళను ఇలా ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఇతను ఇంత మందిని పెళ్లి చేసుకున్నా.. బానిసలుగా చేసుకున్న ఏ తృప్తీ చెందలేదు. అయితే ఓనాడు మెహర్-ఉన్-నిస్సా (నూర్ జహాన్) పై కన్ను పడింది. అప్పటికే ఆమెకి వివాహం అయ్యింది. పైగా భర్త కూడా మరణించాడు. ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు జహంగీర్.
కానీ ఆమె ఒప్పుకోలేదు.. దీనితో అతను తన కోపాన్ని అంతఃపురంలోని స్త్రీలపై చూపి హింసించేవాడు. మూడు ఏళ్లు గడిచాక నూర్ జహాన్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో అందరు భార్యల కన్నా నూర్ జహాన్ పైన బాగా ఇష్టం కలిగిలింది. ఏది ఏమైనా ఎంతో మందిని వివాహం చేసుకున్నాడు జహంగీర్.