అమెజాన్ లో చిన్న వస్తువులు కూడా పెద్ద బాక్స్ లలో ఎందుకు ఇస్తారు..? అసలు కారణం ఇదే..!

అమెజాన్ లో చిన్న వస్తువులు కూడా పెద్ద బాక్స్ లలో ఎందుకు ఇస్తారు..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సులువుగా తమకు నచ్చిన వస్తువులు ఇంట్లో ఉండే ఆర్డర్ పెట్టుకుని పొందుతున్నారు.

Video Advertisement

 

పైగా ఇలా షాపింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అమెజాన్ అనే సంస్థ ద్వారా మనం అప్పుడప్పుడు చిన్న వస్తువులు ఆర్డర్ పెట్టినా పెద్ద బాక్స్ లో అవి వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తాయి అనే సందేహం మీకు కలిగిందా..? అయితే అలా ఎందుకు పంపిస్తారు అనే దాని వెనక ఉన్న కారణాలు చూద్దాం.

#1. ఈ కామర్స్ వెబ్సైట్లలో అమ్మేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్లను సెల్లర్స్ అంటారు. అయితే వాళ్లు ఏం చేస్తారంటే వస్తువు యొక్క కొలతని, పరిణామాన్ని తప్పుగా ఎంటర్ చేయడం కానీ లేదంటే పట్టించుకోకపోవడం కానీ చేస్తూ ఉంటారు. దీంతో ఏ బాక్స్ పెట్టాలి అనేది మిషన్లకి తెలియదు. దీని కారణంగా పెద్ద బాక్సుల్లో మనకి వచ్చేస్తూ ఉంటాయి.

Here's How Amazon Says You Should Handle Packages to Prevent the Spread of Coronavirus | Inc.com

#2. అలానే ఒక్కోసారి మిషన్లు కూడా తప్పు చేస్తూ ఉంటాయి. ఆటోమేటెడ్ ప్యాకింగ్ మిషన్లు చేసే తప్పు వల్ల పెద్ద బాక్సును అనుకోకుండా ఎంపిక చేస్తాయి. దీని కారణంగా కూడా పెద్ద బాక్స్లలో డెలివరీ అయిపోతూ ఉంటాయి.

#3. అదేవిధంగా ఈ సంస్థలు ఐటమ్స్ డెలివరీ చేయడానికి వాడే బాక్స్లని బయట కాంట్రాక్టు ఇచ్చి తయారు చేయించుకుంటూ ఉంటాయి. ఈ కాలంలో చిన్న బాక్స్ల ప్రొడక్షన్ తగ్గింది. పెద్ద బాక్స్లే కాంట్రాక్టు సంస్థలు తయారు చేస్తున్నాయి. కనుక చిన్న వస్తువులకు కూడా పెద్ద బాక్సులనే వాడాల్సి వస్తోంది.

Amazon's push for Prime sign-up 'misleading', says ASA - BBC News

 

#4. ట్రక్కులు వంటివాటిలో ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వస్తువులన్నిటినీ కూడా నిండా వేస్తూ ఉంటారు. అసలు ఖాళీగా ఉంచరు. ఎందుకంటే ఖాళీగా ఉండడం వల్ల ఒక వస్తువు మరో వస్తువు మీద పడిపోయి విరిగిపోతూ ఉంటాయి. అందుకని అలా నింపాలంటే పెద్ద బాక్సులు సౌకర్యంగా ఉంటాయి. అందుకనే పెద్ద బాక్సుల్లో నింపటం జరుగుతుంది.

amazon

ఇలా ఈ కారణాల వల్ల అమెజాన్ లో వచ్చే వస్తువులు పెద్ద బాక్సుల్లో రావడం జరుగుతుంది.


End of Article

You may also like