ఏడ్చే మగాళ్లను నిజంగానే నమ్మకూడదా..? ఇలా ఎందుకు అంటారు..?

ఏడ్చే మగాళ్లను నిజంగానే నమ్మకూడదా..? ఇలా ఎందుకు అంటారు..?

by Megha Varna

Ads

సాధారణంగా మనం ఈ మాట పెద్దల నుంచి ఎక్కువగా వింటూ ఉంటాం. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని.. అయితే ఈ సామెత గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

Video Advertisement

 

అయితే నిజంగా ఏడ్చే మగాళ్లని ఎందుకు నమ్మకూడదు..?, ఎప్పుడైనా దీని వెనుక ఉన్న ఆన్సర్ కోసం ఆలోచించారా..? అయినప్పటికీ మీకు సమాధానం దొరకలేదా…? అయితే ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లనేషన్ ఉంది మరి ఓ లుక్ వేసేయండి. సాధారణంగా ఆడవాళ్లకు ఉన్నట్లే మగవాళ్ళకి కూడా వాళ్ళే యొక్క కష్టాలు ఉంటాయి.

అంతే కాకుండా అబ్బాయిలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆడ మగ అనేది భావోద్వేగాలకి లేదు. జెండర్ తో పని లేకుండా ఇద్దరికీ కూడా భావోద్వేగాలు ఉంటాయి. పైగా పురుషులు వివిధ రకాల పనుల వలన ఒత్తిడి కూడా ఉండడం సహజము. కొన్ని చోట్ల అయితే పురుషుల ఎన్నో పనులు చేసుకోవాల్సి వస్తుంది.

ఇంట్లో పనులు, బయట పనులు వీటితో నిజంగా ఎంతో చికాకుగా ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే సమాజం నుండి ఒక్కోసారి తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఇలాంటివి ఎదురైనప్పుడు తనలోని భావోద్వేగం బయటికి వస్తుంది. అటువంటప్పుడు వాళ్ళు కుంగిపోయి కన్నీళ్లు కూడా కరుస్తారు అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాంటి రచయితలు అన్నారు.

ఒక్కోకసారి వాళ్ళ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అవ్వదు. అలాంటి సమయంలో బావోద్వేగం బయటకు వస్తుంది. ఇది ఇలా ఉంటే గతంలో కంటే పురుషుల్లో ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. 45 సంవత్సరాల లోపు వుండే పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి.

Men Don't Cry' And Numerous Other Ways Patriarchy Harms Men | Youth Ki Awaaz

మహిళలను పురుషులు గౌరవించాలనప్పుడు పురుషులు మనోభావాలని మహిళలు అర్థం చేసుకోవాలి. అలానే వాళ్ళు ఏమైనా సమస్య చెప్పితే ఓపిక వినాలి కూడా. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి పురుషుడి యొక్క సమస్యలు, బాధలు ఎవరూ పట్టించుకోరని.. వినడానికి కూడా ఎవరూ ఇష్టపడరు అని అన్నారు. అలా చెయ్యడం భావ్యం కాదు. అదే విధంగా ఏడవడం అనేది బాధ ఒత్తిడి మొదలైన వాటి వల్ల వస్తుంది. దానికి ఆడ, మగ అనే తేడా ఏముంటుంది..? మీరేం అంటారు మరి.


End of Article

You may also like