Azithromycin Tablet uses Telugu అజిత్రోమైసిన్: ఒక యాంటీ బయోటిక్. వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ నుండి బయట పడేస్తుంది. జలుబు, ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు డాక్టర్లు తీసుకోమని చెప్తూ వుంటారు. ఈ మెడిసిన్ కేవలం బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది.
అలానే మలేరియాను నయం చేయడానికి ఇతర మందులతో పాటుగా దీన్ని కూడా ఇస్తారు. పేగు ఇన్ఫెక్షన్లు అలానే లై#@#క సంక్రమణకు చికిత్స కోసం కూడా ఇది ఉపయోగించబడుతుంది. వైద్యుడిని సంప్రదించకుండా మాత్రం తీసుకోవద్దు.
ఈ మెడిసన్ ని చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్లకి, సైనస్ ఇన్ఫెక్షన్లకి, ఛాతి ఇన్ఫెక్షన్లకి, చర్మ వ్యాధులకి కూడా ఇస్తూ ఉంటారు. డాక్టర్లు ఈ టాబ్లెట్ ని వ్యాప్తి చెందుతున్న మైక్రో బాక్టీరియం అవియం కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయడానికి లేదంటే నివారించడానికి వాడుతారు కూడా.
ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్:
వికారం, ఉబ్బరం, అజీర్తి, డయేరియా, వాంతులు, కడుపునొప్పి, స్కిన్ రాషెస్, ఆకలి లేకపోవడం
What are the Benefits of Azithromycin Tablet in Telugu: ఈ మెడిసిన్ యొక్క ప్రయోజనాలు:
బ్యాక్టీరియా వల్ల కలిగే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఇది కాపాడుతుంది. చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్లకి, సైనస్ ఇన్ఫెక్షన్లకి, ఛాతి ఇన్ఫెక్షన్లకి, చర్మ వ్యాధులకి, మెదడు, ఊపిరితిత్తులు, ఎముకలు, కీళ్లు, కడుపు, పేగులకి సంబంధించిన ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది. డాక్టర్లు ఈ టాబ్లెట్ ని స్వల్పకాలానికి సూచిస్తారు. డాక్టర్లు సూచించిన విధంగానే ఈ మెడిసిన్ ని ఉపయోగించాలి.
అజిత్రోమైసిన్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి..?
- కామెర్లు లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు వంటివి ఉంటే ఈ టాబ్లెట్ ఉపయోగించకూడద
- గుండె సమస్యలు, లివర్ సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, ఎలర్జీ వంటివి ఉంటే కూడా ఈ మందులను వాడకూడదు.
- గర్భధారణ సమయంలో మరియు గర్భధారణ కోసం ప్లాన్ చేస్తున్న మహిళలు కూడా ఈ టాబ్లెట్ ని ఉపయోగించకూడదు.
- పాలిచ్చే మహిళలు కూడా ఈ మెడిసిన్ ని ఉపయోగించకూడదు.
- ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల చికిత్సలో ఈ మందును వాడకూడదు.
- మద్యం సేవించే వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు తీసుకునే ముందు డాక్టర్ ని అడగడం మంచిది.
Azhitromycin Tablet Side effects: అజిత్రోమైసిన్ పడకపోతే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి..?
- కాన్డిడియాసిస్ (Candidiasis)
- నిద్రలేమి (Insomnia)
- తలనొప్పి (Headache)
- మైకము (Dizziness)
- యోని ఇన్ఫెక్షన్ (Vaginal Infection)
- నెట్రోపెనియా (Neutropenia)
- రక్తనాళముల శోధము (Angioedema)
- అనోరెక్సియా (Anorexia)
ఈ మెడిసిన్ ఎలా పని చేస్తుంది..?
బాక్టీరియోస్టాటిక్ ఔషధం ఇది. సున్నితమైన సూక్ష్మ జీవి యొక్క 50S రిబోసోమల్ సబ్యూనిట్లతో కూడి ఉండడంతో ప్రోటీన్ సంశ్లేషణను నిరోధిస్తుంది. ట్రాన్స్పెప్టిడేషన్, ట్రాన్స్లోకేషన్తో ఉల్లంఘిస్తుంది. ప్రోటీన్ సంశ్లేషణ, కణాల పెరుగుదలను నిరోధిస్తుంది ఇది.
మరిన్ని ఆరోగ్య చిట్కాలు, రహస్యాలు తెలుగు కోసం …