మనకి సాధారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యల మొదలు పెద్ద పెద్ద సమస్యల దాకా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ మంది తిమ్మిర్లతో కూడా బాధ పడుతూ ఉంటారు. తిమ్మిర్లు తరచుగా చాలా మందిని బాధ పెడుతూ ఉంటాయి.
Video Advertisement
మీరు కూడా తరచూ ఈ బాధతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి.
ఎవరిలో వస్తాయి..? ఎందుకు వస్తాయి..?
- తిమ్మిర్లు తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. మద్యం తాగే వాళ్లలో షుగర్ పేషెంట్స్ లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది.
- తిమ్మిర్లు తరచుగా వస్తుండడానికి కారణం బి12. విటమిన్ బి12 ఉండవలసిన దానికంటే తక్కువగా ఉంటే ఈ సమస్య కలుగుతుంది. విటమిన్ బి12 కీలకమైన పాత్ర పోషిస్తుంది.
- విటమిన్ బి12 లోపం వలన ఈ సమస్య వస్తుంది.
విటమిన్ బి12 ఎందుకు ముఖ్యం..?
- విటమిన్ బి12 నాడీ మండల వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
- అలానే శరీర ఎదుగుదల కి కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
- ఎర్ర రక్త కణాల తయారీకి కూడా ఇది ఎంతో అవసరం.
- ఇది లేకపోతే శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు తయారు అవ్వవు. ఈ కారణంగా అవయవాలకి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేక పోతే తిమ్మిర్లు వస్తాయి.
- వాపులు, తిమ్మిర్లు, సయాటికా నొప్పులు, వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
విటమిన్ బి12 ని ఎలా పొందొచ్చు..?
- క్యాప్సిల్ రూపంలో తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
- మాంసం, చేప, పాలు, చీజ్, గుడ్లు లో ఉంటుంది.
- అలానే డైరీ ప్రోడక్ట్స్, బీఫ్ లో కూడా ఉంటుంది.
- కానీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయాలి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేక పోతే బీ12 లోపల ఉండదు.
- ఆపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది.