“ఆస్కార్” తో సహా… “RRR” ఇప్పటి వరకు గెలుచుకున్న 16 అవార్డ్స్ ఏవో తెలుసా..?

“ఆస్కార్” తో సహా… “RRR” ఇప్పటి వరకు గెలుచుకున్న 16 అవార్డ్స్ ఏవో తెలుసా..?

by Anudeep

Ads

భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు… సినిమాలోని ‘నాటు నాటు…’ ఆస్కార్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది.

Video Advertisement

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే ట్రెండ్. అదే నాటు నాటు. అప్పట్లో ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక కొన్ని నెలల పాటు ఎలా అయితే ఈ పాటతో దేశం మారుమోగిపోయిందో..  ఇప్పుడు ఇదే పాటకు సినీ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఆస్కార్ రావడంతో యావత్ ఇండియన్ ఆడియన్స్ హుషారెత్తిపోతున్నారు. నాటు నాటు సాంగ్ తో పాటు అందులోని లిరిక్స్, రాజమౌళి టేకింగ్, రామ్ చరణ్ ఎన్టీఆర్ డాన్స్ ఇవన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దీంతో ఈ పాటకు వరుసపెట్టి అంతర్జాతీయ అవార్డ్స్ రావడం, భారతీయుడి సత్తా ప్రపంచవ్యాప్తంగా మరోసారి రెపరెపలాడం వరుసగా జరిగిపోయాయి.

how many awards did RRR won..

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ కి ఇప్పటివరకు ఎన్ని అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం..

 

#1 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్

#2 క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ – ఉత్తమ పాట

#3 హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్

#4 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ – స్పాట్ లైట్ అవార్డు ఫర్ ఆర్ఆర్ఆర్ కాస్ట్

how many awards did RRR won..

#5 లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ – ఉత్తమ సంగీతం

#6 బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ – ఉత్తమ ఒరిజినల్ స్కోర్

#7 పండోర ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ – బెస్ట్ సాంగ్ కంపోజింగ్

#8 ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్

#9 అలయన్స్ అఫ్ విమెన్ ఫిలిం జర్నలిస్ట్స్ – ఉత్తమ విదేశీ భాషా చిత్రం

#10 అట్లాంటా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ – బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్

how many awards did RRR won..

#11 ఆస్టిన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ – బెస్ట్ స్టంట్ కో ఆర్డినేటర్ (నిక్ పావెల్)

#12 నేషనల్ బోర్డు అఫ్ రివ్యూ – ఉత్తమ సంగీతం

#13 నేషనల్ బోర్డు అఫ్ రివ్యూ – ఉత్తమ 10 చిత్రాల్లో ఒకటి

#14 న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు – ఉత్తమ దర్శకుడు

#15 న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ ఆన్లైన్ – ఉత్తమ 10 చిత్రాల్లో ఒకటి

#16 అకాడమీ అవార్డు (ఆస్కార్) – ఉత్తమ ఒరిజినల్ పాట (నాటు నాటు )

how many awards did RRR won..

ఇవే కాకుండా ఆసియన్ ఫిలిం అవార్డ్స్, చికాగో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఫ్లోరిడా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్, జార్జియా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్, జపాన్ అకాడమీ ఫిలిం ప్రైజ్, లాస్ వేగాస్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ, లండన్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ వంటి అవార్డులకు నామినేట్ అయ్యింది ఆర్ఆర్ఆర్ చిత్రం.


End of Article

You may also like