Ads
అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చూసిన వాళ్ళందరూ అది ఒక రాతి విగ్రహంగా భావించడం లేదు. అందులో ఒక పసి పిల్లవాడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు. చూసిన ప్రతి ఒక్కరూ శిల్పి యొక్క కళా నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. పసి పిల్లవాడు చిరునవ్వుతో అద్భుత నయనాలతో కనిపిస్తున్న బాల రాముడు విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహాన్ని మైసూర్ కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే.
Video Advertisement
ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాదిమంది భక్తులు పూజలు చేస్తున్నారని ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు అరుణ్ యోగిరాజ్. తన కొడుకు రూపుదిద్దున బాల విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టమని, యోగిరాజ్ తండ్రి ఉండి ఉంటే ఎంతో సంతోషించి ఉండేవారని ఆ తల్లి ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆ విగ్రహం లోని కళ్ళు జీవ కళ ఉట్టి పడుతూ చూసిన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.
అయితే ఈ కంటికి సంబంధించిన కీలక విషయాన్ని అరుణ్ యోగి రాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి బంగారు ఊలిని చేత్తో పట్టుకుని చూపిస్తూ వీటితోనే బాలరాముడి విగ్రహానికి దివ్య నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు. ఈ విగ్రహం చెక్కడానికి ఆరు నెలలు సమయం పట్టిందని ఈ ఆరు నెలలు మౌనముద్ర వహించాను.
Thought of sharing this Silver hammer with the golden chisel using which I carved the divine eyes (Netronmilana )of Ram lalla, Ayodhya pic.twitter.com/95HNiU5mVV
— Arun Yogiraj (@yogiraj_arun) February 10, 2024
బాల రాముడు విగ్రహం చెక్కిన సమయంలో ఆయన కళ్ళ గురించే నాకు కాస్త భయం ఉండేది, అందుకే కళ్ళు బాగున్నాయా అని మా ఫ్రెండ్స్ ని పదేపదే అడిగేవాడిని. ఒక రాయిలో అలా ఒక భావాన్ని తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. అందుకే చిన్నపిల్లలు ఎలా ఉంటారో గమనించి అదే పసితనం రాముడు విగ్రహం లో కనిపించేలాగా చూసుకున్నాను. ఇదంతా ఆ రాముని దయతోనే జరిగింది అంటూ బంగారు ఉలి, వెండి సుత్తి ఫోటోని అరుణ్ యోగిరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.
End of Article