Ads
రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ లు రచ్చ లేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో పవన్ కళ్యాణ్ కు, పోసాని కృష్ణ మురళి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. మరో వైపు కొందరు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులూ ఈ విషయమై స్పందిస్తున్నారు. తాజాగా.. ఈ విషయమై బాబు మోహన్ కూడా స్పందించారు.
Video Advertisement
పవన్ కళ్యాణ్ అన్ని మాటలు మాట్లాడారని, కానీ ఎలక్షన్స్ లో ఎవరివైపు ఉంటున్నారో చెప్పలేదన్నారు. ఇండస్ట్రీ వైపా..? ప్రకాష్ రాజ్ సైడా? అన్న సంగతి తేల్చాలన్నారు. ఇద్దరు కలిసి కళామతల్లి పరువు తీయకూడదని, సినీ ఇండస్ట్రీ కి ప్రభుత్వ సాయం కచ్చితం గా అవసరమని అన్నారు. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ నే అడిగిందని, కానీ పవన్ కళ్యాణ్ ఏదేదో మాట్లాడారని అన్నారు. ఇండస్ట్రీ సైడా? ప్రకాష్ రాజ్ సైడా? అన్నది తేల్చాలి అన్నారు. వ్యక్తిగతం గా బహిరంగ విమర్శలు చేయడం కన్నా.. తెరచాటున కూర్చుని మాట్లాడుకోవడం మంచిదన్నారు.
End of Article