మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన పంజా వైష్ణవ్‌తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు పేరు మారుమోగిపోయింది. సుకుమార్ అసిస్టెంట్‌గా.. గురువు తగ్గ శిష్యుడిగా బుచ్చిబాబును మెగా అభిమానులతో పాటు అంతా అభిమానించారు. అయితే ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి చాలా కాలమే పట్టింది.

Video Advertisement

 

ఆయన తన తరవాత సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నారని వార్త రాగానే నందమూరి అభిమానులు సైతం ఆనందపడ్డారు. ఒక మంచి రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు అప్పట్లో ఎన్టీఆర్‌కు చెప్పారట. ఆ కథ ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చేసిందట. కానీ , కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడంతో ఎన్టీఆర్-బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కలేదు.

back story of ram charan bucchi babu movie..!!

తాజాగా బుచ్చిబాబు తదుపరి చిత్రం రామ్ చరణ్ తో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎన్టీఆర్ కి చెప్పిన కథతోనే ఇప్పుడు రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ నచ్చని కథ రామ్ చరణ్‌కు ఎలా నచ్చిందంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ ఎన్టీఆర్‌కు చెప్పిన తరవాతే బుచ్చిబాబుకు రామ్ చరణ్ ఓకే చెప్పారని టాక్. ఈ ఇద్దరి మధ్య ఉన్నస్నేహం కారణంగానే చరణ్‌.. తారక్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడనే మాట విన్న అభిమానులు కూడా ఆనందపడుతున్నారు.

back story of ram charan bucchi babu movie..!!

ఈ చిత్రం శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో కబడ్డీ నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. ఈ సినిమా ద్వారా వృద్ధి సినిమాస్ అనే సంస్థ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు వెంకట సతీష్‌కు సహకారం అందిస్తున్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకొనే ఆలోచనలో ఉన్నారంట మేకర్స్.