Ads
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమిషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లు గా నటించారు. ఇందులో టైటిల్ రోల్ లో ఉన్న బద్రి క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు చేయలేరేమో అనే రేంజ్ లో యాక్ట్ చేసాడు పవన్ కళ్యాణ్.
Video Advertisement
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. బద్రిలోని డైలాగులను పవర్ స్టార్ పవన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. బద్రి తెలుగులో 2000 సంవత్సరంలో విడుదలై హిట్ అవ్వడంతో, 2004 లో హిందీలో “షర్త్: ది ఛాలెంజ్” అనే పేరుతో రీమేక్ చేసాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
ఇందులో హీరోగా తుషార్ కపూర్ హీరోగా నటించగా అమ్రిత అరోరా, గ్రేసీ సింగ్ హీరోయిన్లు గా నటించారు. ప్రకాష్ రాజ్ తెలుగు మరియు హిందీలో నందా పాత్రలోనే నటించి ఆకట్టుకున్నాడు. అయితే బద్రిలో ఉండే ఓ ముఖ్యమైన సీన్.. బద్రి (పవన్) ఆఫీస్ కి నందు (ప్రకాష్ రాజ్) వచ్చి నా సరయు (అమిషా పటేల్) నా చెల్లెలు, నువ్ ఇంకోసారి తనతో తిరిగితే అనగానే.. వెంటనే బద్రి నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావ్ అంటాడు. అలా అనగానే నందాకు కోపం వచ్చి సీరియస్ గా కాలర్ పట్టుకుంటాడు.
ఇక్కడ ఇలా సీన్ అంత సీరియస్ నడుస్తుంది. కానీ హిందీలోకి వచ్చేసరికి సీరియస్ సీన్ కాస్త కామెడీ గా మారిపోతుంది. పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో పవర్ ఫుల్ గా చేసిన ఈ సీన్ తెలుగులో సెట్ అయినట్టుగా కాకుండ .. హిందీలో ఈ సీన్ సిల్లీగా ఉంటుంది. హీరో కూడా ఆ డైలాగ్ ని ఏ ఫీల్ లేకుండా చెప్తాడు. దీంతో బద్రి మూవీ లవర్స్ ఫీల్ అవుతున్నట్టుగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
WATCH VIDEO:
End of Article