”బలగం” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

”బలగం” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

by kavitha

Ads

ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాలలో బలగం ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. గ్రామగ్రామనా పాతరోజుల్లో చూసినట్టు ఊరంతా కలిసి ఈ సినిమాని చూశారు.

Video Advertisement

దర్శకుడు వేణు ఈ సినిమా విజయంతో క్రేజ్ ఉన్న దర్శకుల జాబితాలో చేరారు. ఇక బలగం చిత్రంలో ప్రియదర్శి వివాహం చేసుకోవాలని భావించే అమ్మాయి క్యారెక్టర్ లో నటి సౌదామిని నటించారు. ఈ చిత్రంలో బొద్దుగా కనిపించిన సౌదామిని ఒక్క డైలాగ్ లేకుండా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.
బలగం సినిమాలో అంతగా సీన్లు లేకున్నా, ఒక్క డైలాగ్ లేకున్నా, సౌదామిని తన సిగ్గు పడుతూ, ఇన్నోసెంట్ నటనతో ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల సౌదామిని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ అడిషన్ కు వెళ్లినపుడు డైరెక్టర్ వేణు సిగ్గు పడమని చెప్పారని, తాను అలాగే చేయడంతో తనను ఆ పాత్రకు వెంటనే ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం కేకులు బాగా తిని 10 కిలోలు బరువు పెరిగానని తెలిపారు. నా మొదటి చిత్రం ఇదేనని చెప్పారు. తనకు ఫన్ జోనర్ చిత్రాలు  అంటే ఇష్టమని అన్నారు. చిన్నతనం నుండే ఆర్టిస్ట్ కావాలని అనుకున్నానని తెలిపారు. బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే కోవిడ్ కారణంగా  ఆగిపోయిందని చెప్పారు. అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళిన తన అన్నయ్యను తీసుకెళ్ళేదానినని చెప్పుకొచ్చారు. కొందరు నీ ఫేస్ కి  హీరోయిన్ అవుతావా అని అనేవారని దామిని తెలిపారు. హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్  అభిమాన హీరోలు అని అన్నారు.
దర్శకుడు వేణు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం వల్లే ఇంత గుర్తింపు వచ్చిందని సౌదామిని వెల్లడించారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారని, తమ సినిమాలో మంచి పాత్ర ఇస్తామని అన్నారని తెలిపారు. సౌదామిని చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.

Also Read: ఏజెంట్ సినిమా కోసం ”అఖిల్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?


End of Article

You may also like