‘బలగం’ సినిమాకు అంతర్జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చాయంటే..

‘బలగం’ సినిమాకు అంతర్జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చాయంటే..

by kavitha

Ads

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కిన ‘బలగం’ చిత్రం విశ్వ వేదికల పై పురస్కారాలను గెలుచుకుంటూ సత్తాను చాటుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘బలగం’ పేరే వినిపిస్తోంది. ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా బలగం సినిమా చూశావా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం అంతగా ఆడియెన్స్ లోకి హృదయాలలోకి వెళ్ళింది ఈ అచ్చమైన తెలంగాణ చిత్రం.

Video Advertisement

తెలంగాణలోని పల్లెటూరి సంప్రదాయాలను, వారి ఆచార వ్యవహారాలను, తెలంగాణ యాస, భాషలను వెండితెర పై  అత్యద్భుతంగా చూపించాడు దర్శకుడు వేణు వెల్డండి. కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు తొలిసారి దర్శకుడుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి చిత్రం అయినప్పటికి గుర్తుండిపోయే చిత్రాన్ని తీశాడు. చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. దానికి కారణం ఈ చిత్ర కథ, కథనం. కుటుంబంలోని ఆప్యాయత, అనుబంధాలను చూపించిన విధానం అందరనీ ఆకట్టుకుంటోంది.
Balagam-Movie-Got-Best-Drama-Feature-Film-Awardఅందువల్లనే తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఒకప్పటిలా ఊరి ప్రజలంతా ఒక్క చోట కలిసి చూసేలా తెరలు కట్టి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ విధంగా ఒక వైపు థియేటర్లలో, ఇంకోవైపు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతోన్న ఈ చిత్రానికి అవార్డులు రావడం కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొద్ది రోజుల క్రితం ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ఆటోగ్రఫీ కేటగిరీలో లాస్‌ఏంజిల్స్‌ ఫోటోగ్రఫీ పురస్కారాలు వచ్చిన విచ్చేయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి  తెలుగు వేదిక నుండి ఉగాది పురస్కారాలలో నంది అవార్డునూ పొందింది. అయితే తాజాగా ‘బలగం’ చిత్ర ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు కూడా చేరింది.balagam-priyadarshi-1ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో భారతదేశం నుండి ఉత్తమ ఫీచర్ సినిమాగా ‘బలగం’ పురస్కారం అందుకుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు వెల్డండి సామాజిక మధ్యమంలో షేర్‌ చేశాడు. తమ సినిమాకి ఇప్పటి వరకు 4 పురస్కారాలు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నాడు. తన చిత్ర యూనిట్ వల్లనే  ఇది సాధ్యమైందని మూవీ యూనిట్ లో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి సోషల్ మీడియాలో ‘ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం’ అంటూ ఈ విషయాన్ని షేర్ చేశాడు.
balagam-movie-watched-the-entire-village-people2Also Read: ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 20 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

 


End of Article

You may also like