ఆశ్చర్యానికి గురి చేస్తున్న “బాలకృష్ణ” ఆస్తుల విలువ…భార్య, కొడుకు పేరు మీద ఎన్ని కోట్లున్నాయంటే.?

ఆశ్చర్యానికి గురి చేస్తున్న “బాలకృష్ణ” ఆస్తుల విలువ…భార్య, కొడుకు పేరు మీద ఎన్ని కోట్లున్నాయంటే.?

by Mohana Priya

Ads

ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరొక పక్క రాజకీయాల్లో కూడా రాణిస్తున్న నటుల్లో బాలకృష్ణ కూడా ఒకరు. ప్రస్తుతం బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరొక పక్క సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ ఒక డిఫరెంట్ పాత్రలో నటిస్తారు అని తెలుస్తోంది. ఈ సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

Video Advertisement

ఇందులో బాలీవుడ్ కి సంబంధించిన కొంత మంది ప్రముఖ నటులతో పాటు, దుల్కర్ సల్మాన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు అనే వార్త వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే గతంలో బాలకృష్ణ హిందూపురం నుండి రెండు సార్లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా హిందూపురం నుండి తన నామినేషన్ వేశారు. ఇందులో ఆస్తుల వివరాలని, అప్పుల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇందులో బాలకృష్ణ తన ఆస్తులని 81 కోట్లుగా పేర్కొన్నారు.

mokshagna

9 కోట్ల 9 లక్షల అప్పు ఉంది అని కూడా సమాచారం. బాలకృష్ణ భార్య వసుంధర పేరు మీద 140 కోట్ల 38 లక్షల 83 వేలు ఆస్తి ఉంది. వీరి కొడుకు మోక్షజ్ఞ పేరు మీద 58 కోట్ల 63 లక్షల 66 వేలు ఆస్తులు ఉన్నట్టు ఇందులో పేర్కొన్నారు. ఇందులో బాలకృష్ణ ఆస్తుల వివరాలని ఈ విధంగా పేర్కొన్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యారు. కొత్త లుక్ లో మోక్షజ్ఞ కనిపిస్తున్నారు.

మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్న సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నట్టు వార్త వచ్చింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలుసు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఇప్పటికీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. నాలుగవ సినిమా కూడా వస్తుంది అని ఇప్పటికే ప్రకటించారు. అయితే, మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్న సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారు అని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : SRH కెప్టెన్ తో మహేష్ బాబు…ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?


End of Article

You may also like