ఆ సెంటిమెంట్ ఉంటే “బాలయ్య” సినిమా హిట్ అయినట్టేనా..?

ఆ సెంటిమెంట్ ఉంటే “బాలయ్య” సినిమా హిట్ అయినట్టేనా..?

by kavitha

Ads

నందమూరి బాలకృష్ణ అరవై మూడు ఏళ్ల వయసులో యంగ్ హీరోలకు పోటీగా వరుస చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్నేళ్ళ నుండి వరుస పరాజయాలతో ఉన్న బాలయ్య 2021 లో వచ్చిన ‘అఖండ’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, సక్సెస్ ట్రాక్ ను ఎక్కారు.

Video Advertisement

సంక్రాంతికి రిలీజ్ అయిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని బాలకృష్ణ అదే జోష్ లో ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే 108’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే బాలకృష్ణ తన చిత్రాల విషయంలో ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే బాలయ్య ఫ్యాన్స్ కి కూడా బాలకృష్ణ చిత్రాల విషయంలో అనేక సెంటిమెంట్లు ఉన్నాయి. బాలయ్య మూవీ టైటిల్ లో ‘సింహ’ అనే పదం ఉంటే ఆ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని సెంటిమెంట్. అలాగే ఆయన ఉపయోగించే విగ్గుల విషయంలోనూ ఫ్యాన్స్ కు సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే బాలయ్య సినిమా సినిమాకు ఆయన ఒక్కో గెటప్ లో కనిపిస్తారు. అలా గెటప్ ను బట్టి విగ్గులను ఉపయోగిస్తుంటారు.
వాటితో బాలకృష్ణ లుక్ మారుతుంది. ఇక బాలకృష్ణకు విగ్గు సెట్ అయితే ఆ మూవీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. దానికి కారణం బాలయ్య ప్లాప్ అయినా చిత్రాలలో బాలకృష్ణకు విగ్గు సెట్ కాలేదు. ఇక బాలకృష్ణకు విగ్గు సెట్ అయిన చిత్రాలన్ని విజయం సాధించాయి. దీంతో బాలకృష్ణ కూడా ప్రస్తుతం తన లుక్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధను  తీసుకుంటున్నారని సమాచారం. బాలయ్య ట్రెండ్ కు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూనే ఉన్నాడు.ఇదే కాకుండా బాలకృష్ణ చిత్రాల విషయంలో ఇంకొక సెంటిమెంట్ ఉంది. అది ఏమిటంటే స్టార్ డైరెక్టర్స్ తో చేసిన చిత్రాలన్ని హిట్ అయ్యాయి. అందుకే బాలకృష్ణ స్టార్ డైరెక్టర్స్ తో మూవీ చేయటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కనపరుస్తారు. అలాగే బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తే ఆ చిత్రాలు హిట్ అవుతాయని బాలయ్య అభిమానుల నమ్మకం. ఆయన కెరీర్ మొదటి నుండి ఇటీవల వీరసింహారెడ్డి వరకు చాలా సినిమాలు ఈ సెంటిమెంట్ ను నిరూపించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య మూవీ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: “ఉప్పెన” తో పాటు… “విజయ్ దేవరకొండ” రిజెక్ట్ చేసిన 9 సినిమాలు..!


End of Article

You may also like