“ఉప్పెన” తో పాటు… “విజయ్ దేవరకొండ” రిజెక్ట్ చేసిన 9 సినిమాలు..!

“ఉప్పెన” తో పాటు… “విజయ్ దేవరకొండ” రిజెక్ట్ చేసిన 9 సినిమాలు..!

by kavitha

Ads

తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా గాంచిన విజయ్ దేవరకొండ హీరోగా కెరిర్ ప్రారంభించి ఇప్పటికి 7 ఏళ్ళు  కావస్తోంది. విజయ్ దేవరకొండ మూవీ విజయం సాధించి 3 సంవత్సరాలు పైనే అవుతుంది.

Video Advertisement

పెళ్లిచూపులు చిత్రంతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారారు. విజయ్ తన కెరిర్లో ఇప్పటివరకు 10 చిత్రాలను రిజెక్ట్  చేశారు. వాటిలో కొన్ని కథలు నచ్చక, కొన్ని చిత్రాలకు డేట్స్  కుదరక రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రౌడీ హీరో రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్:

తెలుగులో సెన్సేషనల్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’  చిత్రాన్ని హిందీలో విజయ్ దేవరకొండతో రీమేక్ చేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. ఒకసారి నటించిన మూవీ రీమేక్ లో మళ్లీ నటించలేనని ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. అయితే హిందీలో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేస్తే ఈ మూవీ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.
2. ఆర్ఎక్స్ 100:

కార్తికేయ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకుడిగా మారి తీసిన మొదటి సినిమా ఇది. దర్శకుడు ఈ సినిమా కథ టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు చెప్పారు. వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ అప్పటికే అర్జున్ రెడ్డి నటించి ఉండడంతో  ఈ స్టోరి కూడా అలానే ఉందని రిజెక్ట్ చేసాడు.
3. డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్:

తెలుగులో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ హీరోగా హిందీలో రీమేక్ చేయాలని భావించారు. కానీ విజయ్ దేవరకొండ ఆ మూవీని రిజెక్ట్ చేశాడు. అప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ ప్లాప్ కావడంతో భారీగా నష్టాలను మిగిల్చింది. ఆ కారణంగా హిందీ రీమేక్ కోసం కరణ్ జోహార్ ఎంత అడిగిన విజయ్ మాత్రం నో చెప్పాడు.
4. హీరో:

కోలీవుడ్ దర్శకుడు ఆనంద్ అన్నమలై ‘హీరో ‘ మూవీని తెరకెక్కించాలని భావించి, పూజా కార్యక్రమాలు చేసారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మాళవిక మోహన్ హీరో హీరోయిన్లు. వారి పై కొరటాల శివ తొలి షాట్‌కు క్లాప్‌ కొట్టారు. అయితే ఆ సమయంలో విజయ్ నటించిన ‘నోటా’ డిజాస్టర్ కావడం విజయ్ ఈ మూవీని మధ్యలోనే ఆపేశాడు.
5. ఇస్మార్ట్ శంకర్:

విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీలో నటించిన విషయం తెలిసిందే. అయితే వీరి కాంబోలో అంతకుముందే ఒక చిత్రాన్ని అనుకున్నారంట. కానీ ఆ మూవీ కథ నచ్చలేదని, విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడు. కానీ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ మూవీనే ఇస్మార్ట్ శంకర్.
6. భీష్మ:

ప్లాప్స్ తో ఉన్న హీరో నితిన్ కెరీర్ కు హిట్ ను ఇచ్చిన చిత్రం భీష్మ.  2020లో వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ కథను దర్శకుడు మొదట విజయ్ దేవరకొండకు చెప్పగా,  ఈ మూవీ కథ విజయ్ కి అంతగా నచ్చలేదు. తన ఇమేజ్ కు ఈ మూవీ సెట్ కాదని రిజెక్ట్ చేశాడు.
7. కొరటాల శివ సినిమా:

కొరటాల శివ విజయ్ దేవరకొండతో ఒక మూవీని చేయాలని భావించి, కథ చెప్పారంట. విజయ్ దేవరకొండకు కథ నచ్చలేదని ఆ మూవీని రిజెక్ట్ చేశాడు. కొరటాలకు రిజక్ట్ చేయడం అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.
8. ఉప్పెన:

2021 లో దర్శకుడు బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అయితే  బుచ్చిబాబు ఈ స్టోరీ ముందుగా విజయ్ దేవరకొండకే చెప్పాడు. అయితే అది విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారక ముందు, బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఉప్పెన స్టోరిని విజయ్ కు చెప్పాడు. అయితే  జయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు. అంత ఇమేజ్ వచ్చిన విజయ్ ని తన కథలో బుచ్చిబాబు ఊహించుకోలేకపోయాడు. ఇటు విజయ్ కూడా ఉప్పెన ను రిజెక్ట్ చేశాడు.
9. కరణ్ జోహార్ హిందీ సినిమా:

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు విజయ్ దేవరకొండ రెండుసార్లు షాక్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి మూవీ తరువాత విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సమయంలోనే కరణ్ జోహార్ రౌడీ హీరోను బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా ప్రయత్నించాడు.విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం కోసం అన్ని రెడీ చేసిన తరువాత ఆఖరి నిమిషంలో విజయ్ కథ నచ్చలేదు అంటూ ఆ మూవీ నుండి  బయటికి వచ్చేశాడు.

Also Read: PKSDT సినిమా టైటిల్ లీక్..! ఇదేంటి ఇలా ఉంది..?


End of Article

You may also like