పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. వాటిలో సముద్రఖని దర్శకత్వంలో  నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. ఈ మూవీలో పవన్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రం తమిళంలో రూపొందిన వినోదయసీతం అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్ లీక్ అయినట్టు సమాచారం. అయితే ఆ టైటిల్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ మరియు నటుడు అయిన సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతం’ రీమేక్ గా తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించారు. మళ్లీ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో ఆడియెన్స్ ని అలరించబోతున్నారు.
ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఈ చిత్రంలోపవన్ తన పాత్ర షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దేవర దేవుడు, దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్స్  వినిపించాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ లీక్ అయినట్టు తెలుస్తోంది.“బ్రో” అనే టైటిల్ ఎంచుకున్నారని  తెలుస్తోంది. ఈ టైటిల్‌ను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే సాయిధరమ్ తేజ్ పవన్‌ కల్యాణ్‌ని సినిమాలో “బ్రో” అని పిలుస్తాడని, అందువల్ల అదే టైటిల్ గా పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ కి మాత్రం అంత మంచి స్పందన రావట్లేదు. సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఇప్పటికే వైరల్ అయ్యింది. టైటిల్ చూసిన చాలా మంది, “అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన టైటిల్ ఇదేనా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారట.

Also Read: అయిపోయిన విషయాన్ని ఇంకా సాగదీస్తున్నారంటూ.. “నాగచైతన్య” కామెంట్స్..