మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?

మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?

by Anudeep

Ads

గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ బ్లాక్ బస్టర్ అయ్యింది. బాలయ్య పనైపోయిందన్న వాళ్లకు ఈ సినిమా సక్సెస్‌తో సమాధానం ఇచ్చారు. మంచి కథ పడితే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య రచ్చ ఏ విధంగా ఉంటుందో ‘అఖండ’తో మరోసారి ప్రూవ్ అయింది. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా 20థియేటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో సంచలనం రేపింది.

Video Advertisement

ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అక్కడ కూడా అఖండ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే స్టార్ మాలో వరల్డ్ ప్రీమియర్ అయిన సమయంలో కూడా భారీ ఎత్తున రేటింగ్ వచ్చింది. అఖండ వల్ల స్టార్ మాకి భారీ గా లాభం వచ్చిందనే టాక్ వచ్చింది. దీంతో బాలయ్య రానున్న చిత్రం వీరసింహా రెడ్డి సినిమాను కూడా స్టార్ మా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

balayya next movie also in star maa..!!

మైత్రి మూవీ మేకర్స్ వారు శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ తో భారీ మొత్తానికి మూట కట్టుకున్నారనే వార్తలు వస్తున్నాయి. సినిమా పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో మరియు బుల్లి తెరపై బాలయ్య కు ఉన్న స్టార్ డమ్ మరియు క్రేజ్ నేపథ్యంలో స్టార్ మా వారు ఈ సినిమాను గట్టి పోటీలో తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

balayya next movie also in star maa..!!

ఈ మధ్య కాలంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యి ఎక్కువ మంది చూసిన తర్వాత శాటిలైట్ లో ఎక్కువ చూడటం లేదు. అందుకే టీవీ ల రేటింగ్ గతంతో పోల్చితే ఎక్కువ రావడం లేదు. అయినా కూడా అఖండ తెచ్చిన నమ్మకంతో వీర సింహారెడ్డి సినిమాను స్టార్ మా భారీ రేటుకు కొనుగోలు చేసింది. అఖండ సినిమా స్టార్ మాలో టెలికాస్ట్ అవ్వగా అంతకు ముందే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. కనుక వీర సింహారెడ్డి కూడా అక్కడే స్ట్రీమింగ్ అయ్యి టెలికాస్ట్ అవ్వబోతుంది.

balayya next movie also in star maa..!!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా దర్శకుడు గోపీచంద్ గతంలోనే పేర్కొన్నాడు.


End of Article

You may also like