Ads
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు బర్రెలక్క అలియాస్ శిరీష. డిగ్రీ చదివినా కూడా తనకి ఉద్యోగం రాలేదు అని, బర్రెలు వ్యాపారం చేస్తున్నాను అని ఒక వీడియోతో ఫేమస్ అయ్యారు. బర్రెలక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. బర్రెలక్కకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే, మహేష్ బాబు ప్రిన్స్ అవ్వడంతో, బర్రెలక్క తన ఇంస్టాగ్రామ్ ఐడిని ప్రిన్సెస్ అని పెట్టుకున్నారట. ఈ విషయాన్ని బర్రెలక్క ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బర్రెలక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
Video Advertisement
ప్రమోషన్స్ చేయడంతో పాటు, రీల్స్ కూడా చేసి షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల తనకి ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని షేర్ చేశారు. మేకప్ వీడియో షేర్ చేసి, అలాగే ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి సంబంధించిన ఒక చిన్న వీడియోని షేర్ చేశారు. సడన్ గా జరగడంతో ఎవరిని పిలవలేకపోయాను అని, సారీ అని చెప్పారు బర్రెలక్క. ఇప్పుడు ఇంకొక వీడియో షేర్ చేశారు. తన హస్బెండ్ తో మొదటి వీడియో ఇదే అంటూ ఒక వీడియో షేర్ చేశారు. అందులో కొండల మధ్యలో ఉన్న ఒక లొకేషన్ లో వీళ్ళిద్దరూ నడుస్తున్నట్టు ఆ వీడియో ఉంది. అయితే, ఇప్పుడు బర్రెలక్క వెడ్డింగ్ కార్డ్ కూడా బయటికి వచ్చింది. ఇందులో బర్రెలక్క భర్త పేరు తెలిసిపోయింది. ఆయన పేరు వెంకటేష్.
watch video:
వెంకటేష్ వెడ్స్ శిరీష అని, బ్రాకెట్ లో బర్రెలక్క అని రాసి ఉంది. ఇందులో ఆహ్వానించువారు అనే పేర్ల దగ్గర, శ్రీమతి మారేడు బక్కమ్మ, మారేడు బాలకృష్ణయ్య అని పేర్లు రాసి ఉన్నాయి. ఇంటి అడ్రస్ కూడా ఇందులో వివరంగా రాసి ఉంది. అలాగే వెడ్డింగ్ కార్డ్ మీద, ఒకరి వెంట ఒకరు, 7 అడుగులు నడుస్తూ, 6వ ప్రాణంగా, 5వ తనాన్ని మూట కట్టుకొని, 4 దిక్కులు సాక్షిగా, 3 ముళ్ల బంధంతో, 2 జీవితాలు, 1 అయ్యేదే పెళ్లి అని రాసి ఉంది. గురువారం మార్చి 28వ తేదీ వీళ్ళ పెళ్లి అని తెలుస్తోంది.ఈ వెడ్డింగ్ కార్డు ని బర్రెలక్క తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ విషయం చూసిన వాళ్ళందరూ కూడా బర్రెలక్కకి అభినందనలు తెలుపుతున్నారు.
కాబోయే భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది బర్రెలక్క. ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేసారు. అందులో కాబోయే భర్తను ట్యాగ్ చేసారు. అతడి ఇన్ స్టా ఐడిలో ఎంఎస్సీ ఫిజిక్స్ అని ఉంది. మరి ఇతర వివరాలు ఏం తెలీదు. మార్చి 28న శిరీష వివాహం జరగబోతుంది.
ALSO READ : SADGURU DAUGHTER: సద్గురు కూతురు ఎవరో తెలుసా..? ఆమె పెళ్లి ఎప్పుడు జరిగిందంటే..?
End of Article