చనిపోయిన కూతురి కోసం ఈ తండ్రి ఏమి చేసాడో తెలుసా?.. తరచూ ఆమె చదివిన హై స్కూల్ లోనే.. ఓసారి ఏమైందంటే..?

చనిపోయిన కూతురి కోసం ఈ తండ్రి ఏమి చేసాడో తెలుసా?.. తరచూ ఆమె చదివిన హై స్కూల్ లోనే.. ఓసారి ఏమైందంటే..?

by Anudeep

Ads

మనసు విశాలమైతే.. ప్రపంచాన్నే వసుదైక కుటుంబం గా చూడగలుగుతాం అనడానికి బసవరాజ్ చక్కని ఉదాహరణ. బసవరాజ్ బెంగుళూరులోని కల్బుర్గి ,మక్తంపురా కు చెందిన వ్యక్తి. ప్రభుత్వ క్లర్క్ గా పని చేస్తున్నాడు. అతనికి “ధ్యానేశ్వరి” అనే కుమార్తె ఉంది. కూతురు అంటే బసవరాజ్ కు వల్లమాలిన ప్రేమ. తొమ్మిదవ తరగతి చదువుతూ ఉన్న ధ్యానేశ్వరి గతేడాది అనారోగ్యం బారిన పడింది.

Video Advertisement

basavaraj 1

ఆ అంతుచిక్కని రోగం కారణం గా ఆమె మృత్యువాత పడింది. కూతురు మరణించడం తో బసవరాజ్ చాలా మారిపోయాడు. కూతురుని తలుచుకుంటూ కుమిలిపోయేవాడు. తరచూ, ఆమె చదివిన హై స్కూల్ కి వెళ్లి.. ఆమె ఈడు పిల్లలు ఆడుకుంటుంటే చూసి మురిసిపోయేవాడు. వాళ్లలోనే తన కూతురును కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఓ రోజు.. ఆరుబయట కొందరు ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు.

basavaraj 3

అంతలోనే, ఒక ప్యూన్ వచ్చి కొంతమంది ఆడపిల్లల పేర్లు చదవడం ప్రారంభించారు. ఆ పేర్లలో తమ పేర్లు ఉన్న ఆడపిల్లలు లేచి నుంచున్నారు. అలా.. మొత్తం 45 మంది ఆడపిల్లలు లేచి నుంచున్నారు. ఆ ప్యూన్ ఏదో చెప్పగానే.. వాళ్లంతా ఏడుస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. తరువాత ప్యూన్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బసవరాజ్ కు ఏమి జరిగిందో అర్ధం కాక, ప్యూన్ వద్దకు వెళ్లి అడిగాడు.

basavaraj 2

ఆ పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదని, రేపటిలోపు కట్టకపోతే వారిని స్కూల్ కు రావద్దంటూ ప్రిన్సిపాల్ ఆదేశించారని తెలిపాడు. దీనితో బాధపడ్డ బసవరాజ్ ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి.. ఆ 45 మందికి ఫీజు తాను కడతానని, స్కూల్ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. ఏదో ఎమోషనల్ లో మాట్లాడుతున్నాడేమో అని భావించి ప్రిన్సిపాల్ కూడా అందుకు అంగీకరించాడు.

basavaraj 4

మరుసటిరోజుకల్లా.. బ్యాంకు లో 45 మంది పిల్లలకు ఫీజు కట్టడం తో పాటు, మరికొంత మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసి.. ఇంకెవరైనా ఆడపిల్లలు ఫీజు కట్టలేక అవస్థ పడితే.. అందుకోసం ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరాడు. ప్రతి ఏడాది.. తాను చేయగలిగినంతలో ఆడపిల్లలకు ఫీజు కడతానని ముందుకొచ్చాడు. గత రెండేళ్లు గా తనకు తోచినంతలో ఫీజు కడుతూ వస్తున్నాడు. ఆ ఆడపిల్లలోనే తన కూతురుని చూసుకుంటూ బతుకు సాగిస్తున్నాడు.


End of Article

You may also like