Ads
2007 లో రిలీజ్ అయిన హ్యాపీడేస్ చిత్రంలో అప్పు క్యారెక్టర్ గుర్తుందా. ఆవిడేనండీ గాయత్రిరావు. హ్యాపీడేస్ చిత్రంలోనూ, గబ్బర్ సింగ్ చిత్రం తోనూ తన నటనతో అందరిని ఆకట్టుకుంది. చేసింది రెండు చిత్రాలు అయినా మంచి గుర్తింపు మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Video Advertisement
గాయత్రి రావు స్వయానా నటి బెంగుళూరు పద్మకి కన్నకూతురు. ఈ బెంగళూరు పద్మ గారు ఎన్నో చిత్రాల్లోనూ మరియు టెలివిజన్ సీరియల్స్ లోనూ నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
బెంగళూరు పద్మ గారు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హ్యాపీడేస్ చిత్రంలో అప్పు క్యారెక్టర్ లో నటించడానికి గాయత్రికి అసలు ఇష్టం లేదు. అయితే ఈ పాత్రలో నటించడానికి తన జుట్టుని బాయ్స్ లా కట్ చేయించుకోవాలని తెలిపారు శేఖర్ కమ్ముల.
అప్పు జుట్టు చాలా పొడుగ్గా ఉండేది. తన జుట్టు ప్రచురించినప్పుడు చాలా ఘోరంగా ఏడ్చింది. అయితే శేఖర్ కమ్ముల ఒక పెద్ద చాక్లెట్ ఇచ్చి తనను కన్విన్స్ చేశారని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బెంగళూరు పద్మ.
హ్యాపీ డేస్ చిత్రం తర్వాత కొన్ని సంవత్సరాల విరామం తో గబ్బర్ సింగ్ చిత్రంలో నటించారు గాయత్రి రావు. గబ్బర్ సింగ్ లోని ఈ పాత్ర గురించి బెంగళూరు పద్మ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఒకసారి గాయత్రి ఫోటో షూట్ చేయించుకుంది. హరీష్ శంకర్ ఆ ఫోటోని చూసి గబ్బర్ సింగ్ చిత్రానికి ఇలాంటి పాత్ర నటించే వాళ్ళు కావాలి అంటూ గాయత్రిని సెలెక్ట్ చేశారు.
ఈ చిత్ర కథ చెప్పేటప్పుడు ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని హరీశ్ శంకర్ చెప్పారు. స్టోరీ విని ఈ పాత్ర ద్వారా గాయత్రి మంచి గుర్తింపు వస్తుందని మేము భావించాం. చివరికి చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో తన ని చూపించారు అంటూ బెంగళూరు పద్మ గారు ఇంటర్వ్యూలో వెల్లడించారు.
End of Article