• చిత్రం : స్వాతిముత్యం
 • నటీనటులు : బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, రావు రమేశ్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ తదితరులు
 • నిర్మాత : సూర్య దేవర నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్)
 • దర్శకత్వం : లక్ష్మణ్ కే కృష్ణ
 • సంగీతం : మహతి స్వర సాగర్
 • విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022

Video Advertisement

స్టోరీ :

పిఠాపురం ఎలక్ట్రసిటి డిపార్టమెంట్ లో జూనియర్ ఇంజినీర్ గా పని చేస్తూ ఉంటాడు బాలమురళి (బెల్లంకొండ గణేష్). పెళ్లి చూపుల్లో ఓ స్కూల్ టీచర్ భాగ్య లక్ష్మి (వర్ష బొల్లమ్మ) ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. భాగ్యలక్ష్మి కి కూడా బాలమురళి బాగా నచ్చుతాడు. దీంతో పెద్దలు పెళ్లి ముహూర్తం పెడతారు. పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. చివరికి సరిగ్గా పెళ్లి సమయానికి ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. శైలజ (దివ్య శ్రీపాద) తొమ్మిది నెలల బిడ్డతో వచ్చి ఆ బిడ్డకు తండ్రి బాలానే అని అందరిముందూ చెబుతుంది.ఆ బిడ్డకు తండ్రి తనే అని కూడా ఒప్పుకుంటాడు బాలా. దెబ్బకి ఇరు కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. అసలు పెళ్లి కానీ బాలమురళికి కొడుకు ఏంటి…? ఇంతకీ ఆ బాబు ఎవరు ? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ : 

స్పెర్మ్ డొనేష‌న్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది నిర్మాత ముందే రెవీల్ చేసారు. స్నేహితుడు (వెన్నెల కిషోర్) బలవంతం మీద హీరో ఆ పని చేస్తాడు…చివరికి పిల్లాడి రూపంలో హీరోకి సమస్య ఎదురవుతుంది. సెన్సిటివ్ కాన్సెప్ట్ ని ఎమోషన్, సెంటిమెంట్ , కామెడీ కోణంలో తెరకెక్కించి ఉన్న కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ‘స్వాతిముత్యం’ గా చూపించారు దర్శకుడు. తొలి సినిమా అయినప్పటికీ బెల్లంకొండ గణేష్ బాగా నటించాడు. అమాయకంగా నటించే పాత్రలో హీరో ఒదిగిపోయారు అనే చెప్పచ్చు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. మిగితా పాత్రలు కూడా తమ పాత్రల మేరకు నటించారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకి నచుతుంది.

ప్లస్ పాయింట్స్ :

 • కామెడీ
 • నటీనటులు
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • సెకండ్ హాఫ్
 • సినిమాటోగ్ర‌ఫీ

మైనస్ పాయింట్స్:

 • సెన్సిటివ్ కాన్సెప్ట్
 •  ఫస్ట్ హాఫ్

రేటింగ్ : 

2.5 / 5

ట్యాగ్ లైన్ :

ఉన్న కథనే కొత్తగా ఎక్కడా బోర్ కొట్టకుండా చెప్పడంతో ఫామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. చిరు, నాగ్ ల సినిమాలతో కాకుండా సోలోగా వస్తే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది.

ట్రైలర్: