స్ట్రాబెరీలతో మనం జ్యూస్, స్మూతీ, ఐస్ క్రీమ్ ఇలా చాలా రకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. నిజానికి స్ట్రాబెరీల వలన చాలా చక్కటి లాభాలని పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్ట్రాబెరీల వలన చాలా లాభాలు ఉన్నాయి మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

స్ట్రాబెర్రీలలో విటమిన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇందులో పాలీఫినాల్స్ కూడా ఉంటాయి. వివిధ రకాల సమస్యలను స్ట్రాబెరీలు దూరం చేస్తాయి.

#1. ఫైబర్ ఉంటుంది:

స్ట్రాబెర్రీలని తీసుకోవడం వలన ఆకలి ఎక్కువగా కలగదు. ఇందులో ఉండే ఫైబర్ ఉదర సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి సహాయపడుతుంది.

#2. ఇమ్యూనిటీ పెరుగుతుంది:

స్ట్రాబెరీలని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ బి ఇమ్యూనిటీని పెంచుతాయి.

#3. కీళ్ల నొప్పులు ఉండవు:

స్ట్రాబెరీలలో పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. అదే విధంగా కాపర్, ఐరన్, ఐయోడిన్ కూడా ఉంటాయి ఇవి కీళ్ల నొప్పుల్ని దూరం చేయడానికి సహాయపడతాయి.

#4. గ్లూకోస్ లెవెల్స్:

స్ట్రాబెరీలు గ్లూకోస్ లెవెల్స్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి దీనితో టైప్ టు డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

#5. గుండె జబ్బులు దూరం:

స్ట్రాబెర్రీలను తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

#6. కంటి ఆరోగ్యానికి మంచిది:

స్ట్రాబెరీలలో ఉండే విటమిన్ సి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలానే వీటిని తీసుకోవడం వలన చర్మం కూడా కాంతివంతంగా అందంగా మారుతుంది.