హలీం గింజల వల్ల ఇన్ని సమస్యలకి దూరంగా ఉండచ్చు… మీకు తెలుసా..?

హలీం గింజల వల్ల ఇన్ని సమస్యలకి దూరంగా ఉండచ్చు… మీకు తెలుసా..?

by Megha Varna

ఆరోగ్యకరమైన పద్ధతుల్ని కనుక మనం అనుసరించాము అంటే అనారోగ్య సమస్యలు రావు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటున్నారు. అలానే సరైన జీవన శైలి ని అనుసరిస్తున్నారు. ఆరోగ్యానికి హలీం గింజలు బాగా హెల్ప్ అవుతాయి.

Video Advertisement

హలీం గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇక వాటి కోసం చూసేద్దాం. హలీం గింజలని ఆలివ్ గింజలని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి వలన చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. వివిధ రకాల సమస్యలని ఈ గింజలు రాకుండా చేస్తాయి. పైగా పోషకాలను కూడా ఇస్తూ ఉంటాయి.

 హలీం లేదా ఆలివ్ గింజలని ఎలా తినాలి..?

ఈ గింజల్ని కాల్చి కానీ నానబెట్టి లేదా మొలకలు వచ్చిన తర్వాత తీసుకుంటే వీటి ప్రయోజనాలను పొందొచ్చు.

హలీం గింజల వల్ల ఉపయోగాలు ఏమిటి..?

4 periods

  • చాలా మంది ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు తీసుకుంటే పీరియడ్ సరిగ్గా వస్తాయి.
  • హలీం గింజలని తీసుకోవడం వలన రకరకాల లాభాలని పొందొచ్చు. రక్తహీనత చికిత్సలో సహాయపడతాయి ఇవి.
  • తల్లి పాల పెరుగుదలని పెంచుతాయి. పాలిచ్చే తల్లుల్లు తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది.

  • అదే విధంగా ఈ గింజల్ని తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా అవుతుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సో ఈ గింజల్ని రెగ్యులర్ గా తీసుకోవచ్చు.
  • మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఈ గింజలతో.

హలీం గింజలని తీసుకోవడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

అధికంగా హలీం గింజల్ని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య వస్తుంది. జలుబు దగ్గు కూడా రావచ్చు. చర్మం పొడిబారిపోతుంది. అలసట, బరువు పెరగటం వంటి ఇబ్బందులు కలుగుతాయి.

హలీం గింజలని నిల్వ ఉంచే పద్ధతి:

హలీం గింజల్ని తేమ ప్రదేశంలో పెట్టకూడదు పొడిగా ఉండే బాక్స్ ని తీసుకుని అందులో వేసి మూత పెట్టండి. గాలి లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. నీరు తగిలితే గింజలు బూజు పడతాయి కాబట్టి స్టోర్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి.


You may also like

Leave a Comment