ఉదయం పూట ఆహారంలో నెయ్యి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు మీ సొంతం!

ఉదయం పూట ఆహారంలో నెయ్యి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు మీ సొంతం!

by Mounika Singaluri

Ads

చాలామంది నెయ్యి తినటానికి ఇష్టపడతారు కానీ ఆరోగ్యపరంగా లేనిపోని అపోహలతో దానిని దూరం పెడతారు. నెయ్యి తింటే లావు అయిపోతామని, కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, హార్ట్ కి ప్రాబ్లం అవుతుందని ఇలా లేనిపోని భయాలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి నెయ్యికి బరువు పెరగటానికి ఎలాంటి సంబంధము లేదు. ఏదైనా సరే పరిమిత పరిణామములో తింటే ఎటువంటి లోపాలు తలెత్తవు. నిజానికి నెయ్యిని ఒక లిమిట్ లో తింటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. పరగడుపున ఒక చెంచా నెయ్యి తింటే మరీ మంచిది. దీనివలన జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి

Video Advertisement

ప్రేగులలోని ఆమ్లా పీహెచ్ స్థాయిని తగ్గించి చిన్న పేగుని నెయ్యి శుద్ధి చేస్తుంది. అలాగే పొద్దున పూట నెయ్యి తినటం వలన చెడు ఆహారపు అలవాట్లు కారణంగా తలెత్తే సమస్యలు చాలా వరకు తగ్గి మొఖం పడతాయి. మలబద్ధకం ఉన్నవారికి పరగడుపున నెయ్యి తినడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కూడా నెయ్యి మంచి పాత్ర పోషిస్తుంది.

అధిక బరువుతో బాధపడుతున్న వారు ఉదయాన్నే చెంచా నెయ్యి తినడం ద్వారా చాలా సమయం పాటు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఫలితంగా మీరు అతిగా తినకుండా ఉంటారు తద్వారా బరువు పెరగకుండా స్లిమ్ గా
ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఒక గ్లాసుడు వేడి నీటిలో కలిపి తీసుకోవాలి. ఆ తరువాత ఏమైనా తినటానికి కనీసం అరగంటసేపు వేచి ఉండాలి ఇలా చేయటం వలన శరీరంలోని అన్ని సెల్స్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది.

శరీరంలోని సెల్స్ అన్నింటినీ చైతన్యపరిచి పోషణ అందించే సామర్థ్యం నెయ్యికే ఉంటుంది. అందుకే మీ చర్మం కోల్పోయిన సహజ నిగారింపుని మళ్లీ దక్కించుకుంటుంది. మీ చర్మానికి అవసరమైన తేమను అందించి పొడి చర్మం సమస్య నుంచి మీకు తక్షణ ఉపశమనం కలిగించడంలో నెయ్యి ప్రధాన సమస్య పోషిస్తుంది. అలాగే సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను నివారించడంలో కూడా నెయ్యి ప్రధాని పాత్ర పోషిస్తుంది.


End of Article

You may also like