ఇండియన్ టాయిలెట్ vs వెస్ట్రన్ టాయిలెట్. లాభ – నష్టాలూ ఇవే.!

ఇండియన్ టాయిలెట్ vs వెస్ట్రన్ టాయిలెట్. లాభ – నష్టాలూ ఇవే.!

by Sainath Gopi

Ads

ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఇండియన్ టాయ్ లెట్ లు కనిపించడం లేదు. అందరూ వెస్ట్రన్ వాష్ రూమ్ లను వాడుతున్నారు. ఒకప్పుడు మల విసర్జన కోసం మనం వాడిన పద్దతిలో శాస్త్రీయత ఉంది.అలా కూర్చోవడంలో మన ఆరోగ్యం ఉంది..అది పక్కన పెట్టి మన వాళ్లు సౌకర్యం చూసుకున్నారు. కనీసం ఇలా అయినా కొంచెం సేపు కూర్చుని ఉండగలిగితే వ్యాయామం చేసినట్టు ఉంటుంది.

Video Advertisement

ఉపాసన ట్వీట్ కి ఒక వ్యక్తి ఇది యోగాలో ఏ ఆసనం మాడమ్ అంటూ ప్రస్తావించారు..నిజానికి యోగాలో ప్రత్యేకంగా ఆసనం అంటూ లేదు…కాని పవన ముక్తాసనం అని ఒకటుంది. ఈ ఆసనంలో పడుకుని కాళ్లు పొట్టలోకి ముడుచుకోవడం వలన, పొట్టలోని కండరాలపై ప్రెషర్ పడి ఆపానవాయువు(గ్యాస్) ఏమన్నా ఉంటే విడుదల అయిపోతుంది. మన ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చోవడం వలన పొట్టపై ప్రెషర్ పడి, మల ద్వారం తెరుచుకుని మల విసర్జన సులభంగా అవుతుంది.

అంతేకాదు ఇండియన్ టాయిలెట్ వలన ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే “వెస్టర్న్ టాయిలెట్లో మనం దానిపై కూర్చోవడం వలన, మన శరీరం నేరుగా టచ్ అయి యూరినల్ ఇన్పెక్షన్ కి  ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ టాయిలెట్లో అలాంటి దానికి ఆస్కారం ఉండదు. అసలే ఇది కరోనా కాలం చాలా శుభ్రత పాటించాల్సిన సమయం వీలైతే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడానికి  ట్రై చేయండి. లేదనుకుంటే కనీసం ఉపాసన చెప్పినట్ట ఆ పొజిషన్లో కూర్చొని కాసేపు వ్యాయామం చేయడానికైనా ప్రయత్నించండి.


End of Article

You may also like