హమాస్ దాడుల నేపథ్యంలో భారతీయ పరిశోధకులకు అండగా నిలబడ్డ ఇజ్రాయెల్ క్రికెట్ క్లబ్ !

హమాస్ దాడుల నేపథ్యంలో భారతీయ పరిశోధకులకు అండగా నిలబడ్డ ఇజ్రాయెల్ క్రికెట్ క్లబ్ !

by Anudeep

Ads

గత కొన్ని రోజులుగా పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య భీకరమైన దాడులు ప్రతి దాడులు నెలకొన్న సంఘటనలు గురించి అందరికి తెలిసిందే అయితే అలాంటి సంఘటనల దృష్ట్యా అక్కడ ఉన్న ప్రజలే కాదు ఆ దేశంలో స్థిర పడ్డ మన భారతీయలు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఆ దేశం పరిస్థితులు సరిగ్గా అర్థం అవ్వక ఎన్నో కష్టాలు ఎదురుకుంటున్నారు.హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ యూనివర్సిటీలో పలువురు భారత పరిశోధకులు అక్కడే చిక్కుకుపోయారు.గాజా నుంచి వస్తున్న రాకెట్ల దాడి నుంచి వారిని వారు కాపాడుకోవడనికి ఎన్నో అగచాట్లు పడుతున్నారు.

Video Advertisement

also read: ఒసే రాములమ్మ” పాటకి ఇలా కూడా ఎడిటింగ్ చేయచ్చా..? చూస్తే నవ్వాపుకోలేరు..!


అక్కడ ఉన్న యూనివర్సిటీ పక్కనే ఉన్న బీర్షెబా క్రికెట్ క్లబ్ భారత పరిశోధకులను ఊహించని సహాయం లభించింది.నెగెవ్ దక్షిణ ప్రాంతంలోని ఈ క్రికెట్ క్లబ్ కు చెందిన రెండంతస్తుల భవనంలో భూగర్భంలో తలదాచుకునే ఏర్పాటు కూడా ఉంది.హమాస్ రాకెట్ దాడులకు తెరతీయగానే అక్కడి స్థానికులకు రక్షణ కల్పించి వారికి ఆశ్రయం ఇచ్చింది. భారత పరిశోధకులు చిక్కుకుపోయారని తెలియగానే క్రికెట్ క్లబ్ యాజమాన్యం వెంటనే స్పందించి వారికి కూడా ఆశ్రయం లభించేలా చేసింది. భారత పరిశోధకులు తరచూ క్రికెట్ క్లబ్ కి వస్తూ ఉంటారు, వీరు కూడా మా కుటుంబ సభ్యులతో సమానం ఇక్కడి పరిస్థులు గురించి వారికి తెలియదు, వారికి అవగాహన కల్పిస్తూ ఉంటాము అని తెలిపారు బీర్షెబా క్రికెట్ క్లబ్ చైర్మన్ నవోర్ గుడ్కెర్, ఇటీవలే రాకెట్ దాడిలో కేరళకు చెందిన మహిళ మరణించిన సంగతి తెలిసిందే

also Check :ఏపీలో కరోనా పరిస్థితులు మీద ఈనెల19 కి కేసు వాయిదా వేసిన హైకోర్టు !


End of Article

You may also like