తండ్రీ కొడుకుల అనుబంధాల పై ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కొడుకుల కోసం సర్వస్వం త్యాగం చేసే తండ్రుల హృద్యమైన కథల నుండి దారి తప్పిన కొడుకు బాగుపడాలని పైకి తిట్టినా, ప్రేమించే తండ్రుల కథల వరకు ఎన్నో సినిమాలలో చక్కగా, చూపించారు.

Video Advertisement

తండ్రి, కొడుకుల మధ్య బంధాన్ని తెలుగు మూవీ దర్శకులు సూపర్ గా చూపిస్తారు. అలాంటి  కథలతో తెరకెక్కి, ప్రేక్షకుల మనసులను దోచుకున్న తెలుగు సినిమాల్లోని కొందరు తండ్రుల గురించి  ఇప్పుడు చూద్దాం.. 1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రంలో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించగా, ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించారు.
2. సూర్య సన్నాఫ్ కృష్ణన్:

ఈ మూవీలో హీరో సూర్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు.  ఇక ఈ మూవీలో కృష్ణన్ మరియు సూర్య ఇద్దరు తండ్రీ కొడుకుల కన్నా మంచి స్నేహితులుగా ఉంటారు.
3. ఆకాశమంత:

హీరోయిన్ త్రిష నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్ ఆమెకు తండ్రిగా నటించాడు. చిన్నప్పటి నుండి కూతురును  విపరీతంగా ప్రేమించే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించాడు.
4. ఫిదా:

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఇద్దరు కూతుర్ల తండ్రిగా సాయి చంద్ ఆకట్టుకున్నారు. 5. ఆడవారి మాటలకు అర్ధాలు వేరు:

ఈ మూవీలో హీరో వెంకటేష్ తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు. పైకి తిడుతున్నా, కొడుకును ప్రేమించే తండ్రిగా నటించారు. 6. 7/గ్రా బృందావన్ కాలనీ:

ఈ మూవీలో హీరో తండ్రి హీరోను తిడుతూ ఉంటుంది. కానీ కొడుకు గొప్పవాడు కావాలని కోరుకునే పాత్ర.  మీమ్ మెటీరియల్ అయింది కాని చాలా డెప్త్ ఉన్న పాత్ర ఇది. ఈ పాత్రలో చంద్రమోహన్ నటించారు.
7. జెర్సీ:

ఈ చిత్రంలో హీరో నాని మరియు రోనిత్ కమ్రా తండ్రీ కొడుకులుగా నటించారు. క్రికెట్ ను ప్రేమించే తండ్రి, కొడుకులు. కొడుకు కలను నెరవేర్చడం కోసం తండ్రి చేసే త్యాగాన్ని చాలా హృద్యంగా చూపించారు.
8. బొమ్మరిల్లు:

తండ్రీ కొడుకుల సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్తొచ్చే మూవీ బొమ్మరిల్లు. తన కొడుకు బెస్ట్ ఇవ్వాలని తపన పడే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించారు. 9. సన్నాఫ్ సత్యమూర్తి:

అల్లు అర్జున్, సమంత జంటగా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్ అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు. మనం నమ్మిన విలువలే మనల్ని కాపాడతాయి అని చెప్పిన తండ్రినే హీరోగా భావించే మూవీ ఇది.
10. సుస్వాగతం:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దేవయాని హీరోయిన్ గా నటించిన మూవీ సుస్వాగతం. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో విలన్ గా పాపులర్ అయిన రఘువరన్ నటించారు. ఒక తండ్రిలా కాకుండా తన కొడుకుకి మంచి ఫ్రెండ్ లా సలహాలు ఇస్తూ, మంచి, చెడుల గురించి చెప్పే పాత్రలో రఘువరన్ అద్భుతంగా నటించారు.

Also Read: హనుమాన్ జంక్షన్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..? ఏకంగా 7 సార్లు..?