ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలా మంది తల్లుల పాత్రలు చేసారు.. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని సృష్టించాయి. వారి బలమైన క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ కారణంగా తో మనకి బాగా గుర్తుండిపోయారు.
Video Advertisement
ఇప్పుడు అలాంటి శక్తివంతమైన తల్లి పాత్రలు గురించి తెలుసుకుందాం..
#1 శివగామి
బాహుబలి మూవీ లో శివగామి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రమ్య కృష్ణ ఆ పాత్రలో ఒదిగిపోయింది.
#2 శాంతి
నిజం మూవీ లో మహేష్ కి మదర్ గా యాక్ట్ చేసారు తాళ్లూరి రామేశ్వరి. ఈ మూవీ లో శాంతి పాత్రలో చాలా పవర్ ఫుల్ గా యాక్ట్ చేసారు.
#3 భారతి
అసలు అమ్మ రాజీనామా మూవీ లో శారద గారి నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఒక తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగాలు, పడే తపన, బాధ, మనకి చాలా బాగా చూపించారు.
#4 శారద
మాతృదేవో భవ మూవీ చూసి ఏడవని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా.
#5 భువన
రఘువరన్ బీటెక్ మూవీ లో రఘువరన్ తల్లి భువన పాత్రని మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఉద్యోగం కోసం వెతికే తన కుమారుడి కి అన్ని విధాలా అండగా నిలుస్తుంది భువన.
#6 లక్ష్మి
పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ మూవీ లో హీరో తల్లిగా.. లక్ష్మి పాత్రలో జీవిచేసారు జయసుధ.
#7 పార్వతి
ఛత్రపతి మూవీ లో ప్రభాస్ కి తల్లిగా నటించిన భానుప్రియ చాలా పవర్ ఫుల్ గా యాక్ట్ చేసారు.
#8 గోపి
మురారి మూవీ లో మహేష్ తల్లి పాత్రలో నటించారు అలనాటి నటి లక్ష్మి. ఈ మూవీ లో గోపి తన కుమారుడి మీద అమిత మైన ప్రేమతో పరితపించే తల్లిగా కనిపిస్తారు.
#9 అమల
శర్వానంద్ హీరోగా వచ్చిన ఒకే ఒక జీవితం మూవీ లో అమల హీరో తల్లిగా నటించి మెప్పించారు.
#10 సరస్వతి
అమ్మ చెప్పింది మూవీ లో అమాయకుడైన తన కొడుక్కి అన్ని విధాలా అండగా నిలిచే తల్లిగా ఒదిగిపోయారు.
#11 శాంతి
కెజిఎఫ్ మూవీ లో హీరో తల్లి పాత్ర పైనే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆమె ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ తోనే హీరో ఆ స్థాయికి చేరుకుంటాడు.
#12 రోహిణి
అలా మొదలైంది మూవీ లో హీరోకి ఏ కష్టం వచ్చిన సొల్యూషన్ ఇచ్చే తల్లి పాత్రలో రోహిణి నటించారు.