ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

by Mounika Singaluri

Ads

ఇతర భాషలో విడుదలైన చిత్రాలు తెలుగులోకి అనువదించాక బాగా హిట్ అవుతున్నాయి. అలాంటి వాటికి ఓటిటి లో మంచ్ క్రేజ్ ఉంటుంది. అలాంటిదే అక్టోబర్ 6,2023 న తమిళ్ లో విడుదలైన చిత్రం ఇరుగపాట్రు చిత్రం.ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తాజాగా స్ట్రీమ్ అవుతూ తెలుగులో కూడా విడుదలైంది. మరి ఈ సినిమా కథ ఏంటో ఒకసారి చూద్దాం….!

Video Advertisement

మిత్ర అనే ఒక ఆవిడ సైకాలజిస్ట్ గా పని చేస్తూ తన భర్త మనోహర్ తో హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తూ ఉంటుంది. మొదటగా ఆమె ఒక సెమినార్ ని కండక్ట్ చేస్తుంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలతో మిత్ర దగ్గరికి వస్తుంటే, వారికి సరైన అవగాహన కల్పించి పంపిస్తుంది. అయితే అర్జున్ మొదటగా తన భార్య అసలు మాట్లాడట్లేదని, దగ్గరికి వెళ్తే దూరంగా వెళ్తుందని వాదనతో మిత్ర దగ్గరికి వస్తాడు. మిత్ర అంతా విని తన భార్యను రమ్మని చెబుతుంది.

ఆమెతో మాట్లాడక అసలు విషయం మొత్తం అర్థమవుతుంది.తర్వాత అదే తరహాలో పవిత్ర వచ్చి తన భర్త విడాకులు కావాలన్నాడని చెబుతుంది. ఆమె భర్తని రమ్మని చెప్పి సమస్యను తెలుసుకుంటుంది.అయితే ఇలా తన దగ్గరికి విభిన్న సమస్యలతో వచ్చిన వారికి సరైన అవగాహన కల్పించే క్రమంలో తనకి కూడా ఇలాంటి ఒక సమస్య వస్తుంది. మరి ఆ సమస్యను మిత్ర ఎలా పరిష్కరించుకుంది? భార్యాభర్తలను కలిపిందా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి.ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు ఒక గంట కూడా మనసు విప్పి మాట్లాడుకోవట్లేదని సెమినార్ లో చెబుతూ ఉంటుంది మిత్ర.

అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే విడాకులకు కారణం అవుతాయని చెబుతుంది.అయితే అర్జున్ అనే వ్యక్తి తమ దగ్గరికి వచ్చి వారి భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్య, రంగేష్ వ్యక్తి చెప్పిన సమస్య ఇలా ఒక్కొక్కరు మిత్ర దగ్గరికి వచ్చి చెప్పే సమస్యలు ఎక్కడ తన లైఫ్ లోకి వస్తాయో అని భావిస్తుంది.అలాగే మిత్ర, మనోహర్ ఇద్దరి మధ్య అసలు ఒక్కటంటే ఒక్క గొడవ కూడా రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు.సినిమా ప్రధమార్ధం వరకు ఇతరుల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించే మిత్ర కి తన భర్తకి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో కధ మరింత ఆసక్తిగా మారుతుంది. ఏ గొడవ పడకుండా ఉండడం కూడా సమస్య అనే విషయం మిత్రకి తర్వాత అర్థమవుతుంది.

పేపర్ లో వచ్చిన ఒక న్యూస్ తన జీవితాన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని మిత్ర భావిస్తుండగా, తన భర్త మనోహర్ కి ఒక నిజం తెలుస్తుంది.ఆ నిజమేంటి, దాన్ని వాళ్ళిద్దరూ ఎలా పరిష్కరించుకున్నారు అనే ఉత్కంఠతో కథ పూర్తిగా ఒక ఇంటెన్స్ తో సాగుతుంది. అయితే కథలో అర్జున్, రంగేస్ ఇద్దరు జీవితాల మధ్య సమస్యలు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.పెళ్లయిన వారికి ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని ఇస్తాదనే చెప్పాలి. కథలో కొత్తదనం, మాటలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఒకానొక దశలో పెళ్లికి ముందు ఉన్న మనుషులు పెళ్లి తర్వాత ఉండలేరని చెబుతూనే వారి లైఫ్ లో గడిపిన చిన్న చిన్న సంతోషాల్ని వెతికి పట్టుకుని సాగిపోవాలని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ యువరాజ్ దయాలన్.

అయితే ఇది కామన్ ఆడియన్స్ కి అంతగా నచ్చదు.మెచ్యూరిటీ ఉన్న స్టోరీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సంభాషణల్లో కొన్ని పదాలు ఇబ్బంది పెడతాయి.అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కధ నెమ్మదిగా సాగిన ప్రతి సీనులో వచ్చే ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.జస్టిన్ ప్రభాకరన్ అందించిన మ్యూజిక్ బాగుంది. గోకుల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి.సైకాలజిస్ట్ మిత్ర పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ ఆకట్టుకుంది. మెచ్యూర్డ్ గా థింకింగ్ చేసే మనోహర్ పాత్రలో విక్రమ్ ప్రభు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. రంగేష్ గా విద్యార్థ్ ,అర్జున్ గా శ్రీ, పవిత్రగా అబర్నది ,దివ్యగా సానియా అయ్యప్పన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు పరిష్కారం చెప్తూ తీసిన ఈ సినిమాని కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. పెళ్లయిన వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

 

Also Read:ఒకే లాగ కనిపించే 9 మంది హీరోస్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!


End of Article

You may also like