Ads
విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుని, రాణిస్తున్న విలక్షణ నటుడు. ఆయన వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Video Advertisement
విలక్షణ నటుడిగా పేరుగాంచిన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఏ క్యారెక్టర్ అయినా అలవోకగా నటిస్తారు. ప్రస్తుతం సౌత్ నుండి నార్త్ వరకు నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఆయన నటించిన W/O రణ సింగం అనే మూవీ 2020 లో తెలుగులో డబ్ అయ్యింది. ఆ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తమిళ సినిమా “కా పే రణసింగం”. ఈ మూవీని దర్శకుడు పి.విరుమాండి తెరకెక్కించారు. ఈ మూవీ కోలీవుడ్ లో 2020లో అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. అక్కడ విజయం సాధించడంతో ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ టైటిల్ తో తెలుగులో డబ్ చేసి, 2020లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ5 లో అందుబాటులో ఉంది.
ఇక కథ విషయానికి వస్తే, ఒక చిన్న గ్రామంలో నివసించే రణసింగం(విజయ్ సేతుపతి) కి విప్లవ భావాలు అధికంగా ఉంటాయి. గ్రామంలో ఏలాంటి సమస్య వచ్చినా కూడా రణసింగం ముందుండి పోరాడుతాడు. అతని మంచితనం నచ్చడంతో సీత (ఐశ్యర్వ రాజేష్) ప్రేమిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి వివాహం జరుగుతుంది. వారికి పాప పుట్టిన తర్వాత రణసింగం దుబాయ్ కి జాబ్ కోసం వెళ్తాడు.
అయితే అక్కడ రణసింగం పనిచేసే ఫ్యాక్టరీలో జరిగిన గొడవల కారణంగా రణసింగం మరణించాడని చెప్తారు. రణసింగం మృతదేహాన్ని ఇండియాకి రప్పించడం కోసం చేసిన ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత సీత ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ. నటన విషయానికి వస్తే విజయ్ సేతుపతి కనిపించింది కాసేపే అయినా ఎప్పటిలానే రణసింగం పాత్రలో ఒదిగిపోయాడు. ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర ఐశ్యర్వ రాజేష్ ది. ఆమె అద్భుతంగా నటించింది.
Also Read: ఒక సీనియర్ హీరో సినిమా అంటే ఇలా ఉండాలి ఏమో..? ఈ సినిమా చూశారా..?
End of Article