ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ప్రపంచ సినిమాగా మారింది. మన సినిమాలు ఎప్పుడు వస్తాయా అని పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం వరకు ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకు తెలుగు సినిమా అంటే ఒక ప్రాంతం సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అంటే భారతదేశం సినిమా.
Video Advertisement
చిన్న దర్శకుడా పెద్ద దర్శకుడా అన్న తేడా లేకుండా మంచి కథలతో వచ్చి హిట్ల పై హిట్లు కొడుతున్నారు మన దర్శకులు. కానీ అసలు తెలుగు సినిమాకి సరైన గుర్తింపు లేని సమయంలోనే అందర్నీ ఆశ్చర్య పరిచే కొత్త తరహా కథలతో హిట్ కొట్టి అందర్నీ అవాక్కయ్యేలా చేసిన ఒకే ఒక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 1989 లో అక్కినేని నాగార్జునతో తీసిన “శివ” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు ఆర్జీవీ.
అలా తీసిన మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి నంది అవార్డ్ అందుకుని అందర్నీ ఆశ్చర్య పరచడమే కాక ప్రేక్షకుల మనసుల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వర్మ. తన ప్రత్యేకమైన కథా శైలికి అవధులు లేవని చెప్తూ వరసగా ఒకదాని తరువాత ఒకటి భారీ విజయాల్ని అందుకుని సినిమా అంటే తన సినిమా మత్రమే అని గుర్తుకొచ్చేంతలా అందర్నీ ప్రభావితం చేసారు.
ఇప్పుడు ఆర్జీవీ తీసిన బెస్ట్ మూవీస్ ఏవో చూద్దాం..
#1 శివ
1989 లో అక్కినేని నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో శివ చిత్రాన్ని తెరకెక్కించారు ఆర్జీవీ. ఈ మూవీ కి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ మూవీ తో తానేంటో అందరికి నిరూపించుకున్నాడు వర్మ.
#2 రంగీలా
ఆమిర్ ఖాన్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో వచ్చిన రంగీలా మూవీ తో మరో హిట్ అందుకున్నాడు ఆర్జీవీ. ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ సూపర్ హిట్స్ ఏ.
#3 సత్య
జేడీ చక్రవర్తి, ఊర్మిళ, మనోజ్ బాజ్‌పేయి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ క్రైమ్ బేస్డ్ డ్రామా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ సినిమా జాతీయ అవార్డుతో పాటు పలు ప్రశంసలు అందుకుంది.
#4 రక్తచరిత్ర
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో రక్త చరిత్ర సినిమాను రెండు పార్టులుగా తీసిన విషయం తెలిసిందే. నిజ జీవిత గాథ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి స్పందన దక్కించుకుంది.
#5 గాయం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఊర్మిళా మండోద్కర్, రేవతి నటించగా శ్రీ సంగీతం అందించాడు. ఈ చిత్రం విజయవాడ లో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారం గా తెరకెక్కింది.
#6 రాత్రి
నటి రేవతి ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ మూవీ రాత్రి జనాలను ఒక రేంజ్ లో భయపెట్టింది.
#7 సర్కార్
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
#8 క్షణ క్షణం
వెంకటేష్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన క్షణ క్షణం మూవీ కూడా ప్రేక్షకులని బాగా అలరించింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
#9 గోవిందా గోవిందా
ఒక దొంగతనం చుట్టూ తిరిగే గోవిందా గోవిందా మూవీ లో నాగార్జున, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు.
#10 అనగనగా ఒక రోజు
జేడీ చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం వర్మ కెరీర్ లో ఒక మంచి చిత్రం.
#11 రణ్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్ హీరోలుగా నటించారు.
#12 దెయ్యం
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో అద్భుత హారర్ మూవీ దెయ్యం. ఈ చిత్రం లో జేడీ చక్రవర్తి, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు.