మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తానేంటో నిరూపించుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. వెండితెరపై తిరుగులేని అభిమానగణం మెగాస్టార్ చిరంజీవి సొంతం. అలాంటి బరువైన మెగా ట్యాగ్‌తో చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన తీరు ప్రశంసనీయం.

Video Advertisement

2007లో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘చిరుత’ తనకు డెబ్యూ మూవీ కాగా.. మొదటి అడుగులోనే డాన్స్‌లో గ్రేస్ చూపించి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు చరణ్. ఈ సక్సెస్‌ వెనుక రామ్ చరణ్ పడ్డ శ్రమ అంతా.. ఇంతా కాదు. ఇప్పుడు చరణ్ కెరీర్ లో చేసిన బెస్ట్ మూవీస్ / పాత్రలు ఏవో చూద్దాం..

#1 చిరుత

మొదటి చిత్రం ‘చిరుత’తో అభిమానుల్లో మంచి ఇంప్రెషన్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రం యూట్యూబ్ లోఅందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#2 మగధీర

రామ్ చరణ్ రెండో సినిమా ‘మగధీర’. ఈ సినిమా 2009లో విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రం తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు చరణ్. ఈ చిత్రం ఎంఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#3 రంగస్థలం

రామ్ చరణ్ నటించిన సినిమాలలో ‘రంగస్థలం’ ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ టాలీవుడ్‌లో మరింత పాపులర్ అయ్యారు. స్టార్ డమ్ పక్కన పెట్టి ఓ సాదాసీదా పాత్రలో నటించి మిగితా హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#4 ఎవడు

రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎవడు మూవీ తో మరో హిట్ కొట్టాడు చరణ్. ఈ చిత్రం వుట్ లో అందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#5 నాయక్

రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ మూవీ లో అందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#6 ధృవ

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం తో తాను సినిమాలను ఎంచుకొనే పంథా మార్చారు చరణ్. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#7 ఆర్ఆర్ఆర్

‘ఆర్ఆర్ఆర్’తో వేల కోట్ల వసూళ్లు పోగేసుకుని, పాన్ ఇండియా వైడ్ కాదు ఏకంగా వరల్డ్ వైడ్ సెన్సేషన్ గా మారిపోయాడు చరణ్. ఈ చిత్రం లో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో మెప్పించారు చరణ్. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

list of best performances of Ram charan tej..!!

#8 ఆరంజ్

చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిన ఈ చిత్రం లో రామ్ చరణ్ చాలా అద్భుతం గా నటించారు. ఈ చిత్రం ఇప్పటికే అందరికీ ఆల్ టైం ఫెవరెట్ మూవీ.

list of best performances of Ram charan tej..!!

#9 గోవిందుడు అందరివాడేలే..

వరుస కమర్షియల్ చిత్రాలు చేసిన చరణ్ ఈ చిత్రం తో తన పంథా మార్చాడు. ఈ చిత్రం లో ఎమోషనల్ సీన్స్ లో చరణ్ అద్భుతం గా నటించారు.

list of best performances of Ram charan tej..!!