Ads
ఒక్కోసారి మనం నిద్ర లేవగానే మనకు ఎంతో బద్దకంగా ఉంటుంది. రోజు మొదలు పెట్టాలని కూడా అనిపించదు. కనీసం మంచం మీద నుండి దిగాలని కూడా అనిపించదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా..? ముఖ్యమైన పనులు ఆగిపోతాయని భయం వేస్తోందా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే.
Video Advertisement
ఉదయం బద్ధకం నుండి బయటపడడానికి ఈ మార్గాలని ఫాలో అవ్వండి అప్పుడు ఖచ్చితంగా మీరు బద్ధకం నుండి బయటకు వచ్చేసి మంచిగా మీ పనులను టైం కి పూర్తి చేసుకోవడానికి అవుతుంది.
బద్ధకం నుండి బయటపడడానికి మార్గాలు:
#1. ఉదయం లేవగానే వాకింగ్ చేయండి:
లేవగానే వాకింగ్ చేయడం వల్ల బద్ధకం పోతుంది నీరసం కూడా ఉండదు. కొత్త ఉత్సాహాన్ని తీసుకు వస్తుంది. కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేయండి దీంతో శరీరం చురుకుగా మారుతుంది కూడా. మీ పనులపై కూడా ఏకాగ్రత పెట్టడానికి అవుతుంది.
#2. నీళ్లు తాగండి:
లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిది. ఉదయం లేవగానే చాలామంది టీ తాగుతూ ఉంటారు కానీ గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరం చురుకుగా మారుతుంది. పైగా ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
#3. అలారంని దూరంగా పెట్టండి:
చాలామంది అలారం పెట్టుకుంటూ ఉంటారు కానీ అలారం రింగ్ అయిన తర్వాత దానిని ఆపేస్తూ ఉంటారు. అలా కాకుండా అలారం దూరంగా ఉంచితే మీరు ఆపకుండా ఉండటానికి అవుతుంది కాబట్టి అలరాముని దూరంగా ఉంచండి.
అలానే ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మంచిగా నిద్రపోతే ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలామంది నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కచ్చితంగా మంచిగా నిద్ర పోవడానికి చూసుకోవాలి లేకపోతే సమస్యలు వస్తాయి.
End of Article