బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 ఇయర్ సమ్మర్ లో భారీ సినిమాలు ఏమి లేక పోయినా కానీ మీడియం రేంజ్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. నాని హీరోగా నటించిన దసరా, సాయితేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలు కేవలం 3 వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్ కి కాస్త ముందుగానే సమ్మర్ సందడిని తెచ్చాయి.
Video Advertisement
అయితే దసరా సినిమా స్టార్ హీరోల రేంజ్ బజ్ ను సొంతం చేసుకుని ఓపెనింగ్ డే రోజున ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత విరూపాక్ష సినిమా బజ్ పరంగా చాలా లో బజ్ తో వచ్చి హిట్ అయ్యింది. దసరా మూవీ మాస్ మూవీ కాగా విరూపాక్ష మూవీ హర్రర్ జానర్ లో తెరకెక్కింది. దసరా 70 కోట్ల బడ్జెట్ తో తెరకెకెక్కగా విరూపాక్ష 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.
దసరా మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లు రాబట్టింది. అలాగే విరూపాక్ష 12 కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ దసరా మూవీ కంటే విరూపాక్ష సినిమాకే ఎక్కువ లాభాలు రావడం మనం గమనించాలి. దసరా సినిమా థియేట్రికల్ హక్కులను లాభాలను సంబంధం లేకుండా హోల్ సేల్ గా అమ్మేశారు. ఈ విధంగా చేయడం వల్ల సినిమాకు పలు ఏరియాలలో లాభాలు వచ్చినా ఆ లాభాలు దసరా నిర్మాతకు చేరలేదు.
అయితే విరూపాక్ష సినిమా విడుదలకు ముందే నిర్మాతకు 5 కోట్ల రూపాయల లాభాలను అందించింది. లాభాలు వచ్చే విధంగా ఒప్పందాలను కుదుర్చుకుని ఈ సినిమా హక్కులను విక్రయించారు. విరూపాక్ష మూవీ త్వరలో ఇతర భాషల్లో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా సక్సెస్ సాధిస్తే విరూపాక్ష లాభాలు ఊహించని రేంజ్ లో ఉంటాయి. ఈ మూవీ తో సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.